Asianet News TeluguAsianet News Telugu

బిచ్చగాడు హ్యాట్రిక్ కొడతాడా

  • బిచ్చగాడు, బేతాళుడు సినిమాలతో మాంచి జోష్ మీదున్న విజయ్ ఆంథోని
  • త్వరలో రిలీజ్ కానున్న విజయ్ ఆంథోోని యెమెన్
  • యెమెన్ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టే దిశగా విజయ్ ఆంథోనీ
vijay anthony may hit hatrick next

బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా మారాడు విజయ్ ఆంథోని. తమిళనాటనే కాక తెలుగులో బిచ్చగాడుతో సంచలన విజయం సాధించిన విజయ్ ఆంటోనీ తాజాగా యమన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈనెల 24న తెలుగు , తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది యమన్. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం పై విజయ్ ఆంటోనీ చాలా ఆశలే పెట్టుకున్నాడు.

విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ భిన్నమైన పంథాలో ప్రయాణిస్తున్న విజయ్ ఆంటోనీ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది బిచ్చగాడు చిత్రంతో . బిచ్చగాడు తర్వాత వచ్చిన బేతాళుడు మంచి వసూళ్ల ని సాధించింది. ఇక యమన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios