- Home
- Entertainment
- Raghuvaran Untold Story: నేను తాగను అని బతిమాలినా వినలే.. రఘువరన్ను మద్యానికి బానిస చేసిన హీరో
Raghuvaran Untold Story: నేను తాగను అని బతిమాలినా వినలే.. రఘువరన్ను మద్యానికి బానిస చేసిన హీరో
Raghuvaran Untold Story : 200కి పైగా సినిమాల్లో నటించిన రఘువరన్ జీవితంలో జరిగిన చేదు సంఘటనలు, ఆయన మరణం వెనుక ఉన్న విషయాలను, మద్యానికి బానిసని చేసిన హీరో ఎవరో తెలుసుకుందాం.

నటుడు రఘువరన్ గురించి తెలియని నిజాలు
90స్ కిడ్స్‌కి నటుడు రఘువరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన డిఫరెంట్ యాక్టింగ్, గంభీరమైన వాయిస్, ప్రత్యేకమైన మేనరిజంతో ఆయన అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల సినిమాల్లో నటించి, ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు రఘువరన్. నేటికీ ఆయన పాత్రల ద్వారా జనాల మనసులో బతికే ఉన్నారు. అయితే, సినిమా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు మద్యం అలవాటు ఆయన జీవితంపై తీవ్ర ప్రభావం చూపింది. అసలు ఆయనకు ఈ వ్యసనం ఎలా వచ్చిందంటే?
200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన రఘువరన్!
రఘువరన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బేస్ వాయిస్, విలన్ పాత్రల్లో ఆయన చూపించే భయంకరమైన నటన. రజనీకాంత్ నటించిన 'బాషా' సినిమాలో ఆంటోనీ పాత్ర, ఆ తర్వాత 'ఒకే ఒక్కడు'లో ముఖ్యమంత్రి క్యారెక్టర్, `శివ`లో విలన్ రోల్` లాంటి ఎన్నో భిన్నమైన పాత్రలకు ప్రాణం పోశారాయన. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ లాంటి పలు భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించారు. తన అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, ప్రశంసలు కూడా దక్కించుకున్నారు.
మద్యానికి బానిసైన నటుడు!
సినిమాల్లో టాప్ పొజిషన్లో ఉన్న రఘువరన్ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. పర్సనల్ లైఫ్‌లో ఎదురైన ఒత్తిడి, ఇతర సమస్యల వల్ల ఆయన మద్యానికి బాగా బానిసయ్యారని చెబుతారు. రోజులు గడిచేకొద్దీ ఈ అలవాటు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.
ఒకసారి ఓ హిందీ సినిమా షూటింగ్ సమయంలో, ఓ స్టార్ హీరోనే తనను మద్యానికి బానిస చేశాడని రఘువరన్ చెప్పారు. తాను తాగనని బతిమాలినా, ఆ హీరోనే తనకు మద్యం అలవాటు చేశాడని రఘువరన్ చెప్పినట్లు సమాచారం. కానీ ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం రఘువరన్ ఎప్పుడూ బయటపెట్టలేదు. మద్యం వల్ల తన సినీ జీవితం, కుటుంబ జీవితం చాలా దెబ్బతిన్నాయని ఆయన బాధపడేవారట.
నటి రోహిణితో పెళ్లి, ఆ తర్వాత విడాకులు!
రఘువరన్ పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలంటే.. ఆయన 1996లో ప్రముఖ నటి రోహిణిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2000లో ఓ బాబు పుట్టాడు. అతడికి వరుణ్ రిషి అని పేరు పెట్టారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రోహిణి, రఘువరన్ 2004లో విడాకులు తీసుకున్నారు. ఆయన జీవితంలో అటు పర్సనల్‌గా, ఇటు సినిమాల్లో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. దీనికి తోడు మద్యం అలవాటు ఎక్కువై ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.
అవయవాలు దెబ్బతిని మరణం!
మితిమీరిన మద్యం సేవిండం వల్ల రఘువరన్ ఆరోగ్యం బాగా పాడైపోయింది. చివరకు అవయవాలు దెబ్బతిని 2008 మార్చి 19న ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 49 ఏళ్లు మాత్రమే. నేడు రఘువరన్ మన మధ్య లేరు. కానీ ‘బాషా’, `శివ`తో పాటు ఎన్నో సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. తన విలక్షణమైన నటనతో, గంభీరమైన గొంతుతో భారతీయ సినిమాలో చెరగని ముద్ర వేసిన ఈ నటుడిని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.













