విజయ్ అదిరింది 60 కోట్లు నష్టపోయిందట

vijay adirindi movie loss is 60crores
Highlights

  • దీపావళి కానుకగా రిలీజైన విజయ్ అదిరింది
  • అదిరింది మూవీ రిలీజ్ పై గతంలో పలు అభ్యంతరాలు
  • కోర్టు సపోర్ట్ ఇవ్వటంతో రిలీజైన మెర్సల్ కు సూపర్ హిట్ టాక్
  • తాజాగా మెర్సల్ మూవీ 60 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ఆరోపణలు

తమిళ తళపతి విజయ్ హీరోగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కించపరిచేలా డైలాగులు వున్నాయంటూ.. కాషాయ నేతలు, కార్యకర్తలు మెర్సెల్ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు మద్దతుతో ఎట్టకేలకు విడుదలైంది. దీపావళి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించిందని నిర్మాతలు ప్రకటించారు.

 

పేదలకు ఉచిత వైద్యసేవ అనే అంశం మూలకథగా రూపొందిన అదిరింది చిత్రంలో.. తమిళ స్టార్‌ విజయ్‌ త్రిపాత్రాభినయం చేశారు. ‘బాహుబలి 2’ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మెర్సల్ నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.

 

తాజాగా ‘అదిరింది’ చిత్రం నిర్మాతలకు రూ.60 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని నటుడు, భాజపా నేత ఎస్‌.వి.శేఖర్‌ అన్నారు. ‘‘అదిరింది’ చిత్రం వల్ల రూ.60 కోట్ల నష్టం చేకూరింది. హీరో విజయ్‌  తన పారితోషికం తీసుకున్నాడు. తన గత సినిమాకు రూ.3 కోట్లు తీసుకున్న దర్శకుడు అట్లీ మెర్సల్ కు రూ.13 కోట్లు తీసుకున్నాడు.  ఈ సినిమా బడ్జెట్‌ పెరగడానికి ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి’ అని ఆయన ఆరోపించారు. నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపించారని అభిప్రాయపడ్డారు.

 

అట్లీ దర్శకత్వంలో వచ్చిన మెర్సల్ చిత్రంలో నిత్యామీనన్‌, కాజల్‌, సమంత కథానాయికల పాత్రలు పోషించారు. ఎస్‌.జె. సూర్య  విలన్ పాత్ర పోషించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. మద్రాస్ హైకోర్టు అనుమతితో సినిమా రిలీజ్ అయింది.

loader