నయన్ కు పెళ్లి వయసొచ్చిందని గుర్తు చేస్తున్నాడు!

vignesh siva marriage proposal to nayantara
Highlights

దక్షినాది స్టార్ హీరో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి 

దక్షినాది స్టార్ హీరో నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విహార యాత్రలకు వెళ్ళడం, పుట్టినరోజు వేడుకలు కలిసి జరుపుకోవడం వంటి విషయాలతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి. గతంలో చాలా సార్లు పరోక్షంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. మొన్నామధ్య ఒక కార్యక్రమంలో విగ్నేష్ ను నయన్ తన ఫియాన్సీ(కాబోయే భర్త) అని వ్యాఖ్యానించడంతో వీరి ప్రేమ నిజమేననే విషయం అందరికీ తెలిసింది.

తాజాగా విగ్నేష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూస్తే త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుందనే సందేహాలు కలుగుతున్నాయి. ''హే.. నాకు పెళ్లి వయసొచ్చింది, నీకోసం ఎదురుచూడనా?' అంటూ తమిళంలో నయన్ తో దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టాడు విగ్నేష్.

నిజానికి ఈ పదాలు నయన్ నటిస్తోన్న 'కొలమావు కోకిల' అనే తమిళ చిత్రంలో ఒక పాటలోవి. ఆ పాటను చిత్రబృందం విడుదల చేసిన సందర్భంగా విగ్నేష్ ఈ విధంగా స్పందించాడు. దీంతో త్వరలోనే ఈ జంట ఒక్కటయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నయన్ తెలుగులో 'సై.. రా' అనే సినిమాలో నటిస్తోంది.  

loader