సూపర్ స్టార్ రజినీసరసన విద్యాబాలన్ పా రంజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ కబాలీ 2 చిత్రానికి నిర్మాతగా ధనుష్
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0 చిత్రంతో బిజీగా ఉన్నారు. తన తదుపరి చిత్రాన్ని రూపొందించే అవకాశాన్ని కబాలీ దర్శకుడు పా రంజిత్ కే ఇచ్చారు రజినీ. కబాలీ సృష్టించిన హంగామా తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న మరో చిత్రంపై మళ్లీ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే కాస్ట్ అండ్ క్రూ సహా అన్ని అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా రజినీ సరసన హీరోయిన్ కూడా కన్ఫమ్ అయింది. మరెవరో కాదు... రజినీ తదుపరి చిత్రంలో విద్యాబాలన్ ఖరారైంది.

చిత్ర నిర్మాతలు ఇప్పటికే విద్యాబాలన్‌ను కలిసి కథ వినిపించారట. ఆమె కూడా వెంటనే రజనీ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్థుతం డేట్లు సర్దుబాటు చేసే పనిలో విద్యాబాలన్ ఉన్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలోనే ఆమె అగ్రిమెంట్‌పై సంతకం చేస్తారని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నటు పేర్కొన్నారు.
రజనీ నటించే ఈ చిత్రానికి ఆయన అల్లుడు ధనుష్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మేలో సెట్స్ పైకి వెళ్లే ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన కబాలి చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా... దాదాపు రూ.300 కోట్లు వసూలు చేసింది. దీంతో కబాలి 2కి ప్లాన్ చేశారు.
పా రంజిత్ దర్శకత్వం వహించే ఈ తాజా చిత్రం కబాలికి సీక్వెల్ కాదట. సరికొత్త, విభిన్నమై కథాంశంతో రజనీ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర అత్యంత కీలకం కావడంతో విద్యాబాలన్ ను తీసుకొన్నట్టు సమాచారం. ప్రస్థుతం రోబో 2.0 చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీ ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాగానే పా రంజిత్ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నారు.
