బాలయ్య రూ.2 కోట్లు ఇచ్చి మరీ తీసుకొచ్చాడు!

vidyabalan remuneration for ntr biopic
Highlights

ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ బాగుంటుందని క్రిష్ సూచించగా ఆమెను సెట్స్ పైకి తీసుకురావడం కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడట బాలయ్య. నిజానికి సినిమా ఆమె పాత్ర చాలా చిన్నది. ఏ సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నా సరిపోతుంది కానీ బాలయ్య మాత్రం సినిమాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ తీసుకురావడం కోసమే విద్యాబాలన్ ను రంగంలోకి దింపారు.

దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తన తండ్రి బయోపిక్ ను తనే స్వయంగా నిర్మిస్తున్నాడు. దీంతో ఏ విషయంలో కూడా రాజీ పడడం లేదు బాలయ్య. ఈ సినిమాకు జీతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనేది బాలకృష్ణ ప్లాన్.

దానికోసం ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాకు ఏం కావాలన్న దగ్గరుండి సమకూరుస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ భార్య పాత్రలో విద్యాబాలన్ బాగుంటుందని క్రిష్ సూచించగా ఆమెను సెట్స్ పైకి తీసుకురావడం కోసం ఏకంగా రూ.2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడట బాలయ్య. నిజానికి సినిమా ఆమె పాత్ర చాలా చిన్నది. 

ఏ సీనియర్ హీరోయిన్ ను తీసుకున్నా సరిపోతుంది కానీ బాలయ్య మాత్రం సినిమాకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ తీసుకురావడం కోసమే విద్యాబాలన్ ను రంగంలోకి దింపారు. కేవలం విద్యాబాలన్ మాత్రమే కాదు.. పలువురు టాలీవుడ్ అగ్ర నటీనటులను ఈ బయోపిక్ లో భాగం చేసే పనిలో పడ్డాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. 

loader