ఎన్టీఆర్ బయోపిక్ భారీ స్థాయిలో రూపొందించడానికి బాలకృష్ణ సిద్ధం అవుతున్నారు. స్వయంగా బాలయ్య నటించబోతున్న సంగతి తెలిసిందే. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. వచ్చే ఏడాది ఎన్నికల ముందు ఎన్టీఆర్ బయోపిక్ ని విడుదల చేయాలనేది బాలయ్య ఆలోచన. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గా 62 గెటప్ లలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నా విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పటి పాత్ర కోసం శర్వానంద్ ని ఎంపిక చేసారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వివరాలపై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావలసి ఉంది.