నాకు పిల్లలు కనే సమయం లేదు, ఈ సారి మా ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు

vidya balan interesting answer when questioned about children
Highlights

  • బాలీవుడ్ లో తన సత్తా చాటిన బోల్డ్ బ్యూటీ విద్యాబాలన్
  • జనవరి 1తో 39 ఏళ్లకు చేరనున్న విద్యాబాలన్
  • ఈ సారి తన భర్త ఏదో స్పెషల్ గా ట్రై చేస్తున్నాడంటున్న విద్య

 

తన బోల్డ్ యాటిట్యూడ్ తో డర్టీ పిక్చర్ లాంటి మూవీ తీసి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది విద్యాబాలన్. విద్య ఏం చేసినా స్పెషలే. ఈ జనవరి 1న విద్యా తన 39వ పుట్టినరోజు జరుపుకొంటుంది. ఈ సందర్భంగా తన పుట్టినరోజు వేడుకల గురించి విద్య మీడియాతో మాట్లాడింది.

 

తనకు సినిమాలే పిల్లలతో సమానమని అంటోంది విద్యాబాలన్‌. ‘39 ఏళ్లు వస్తున్న సందర్భంగా ఏదన్నా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం నా స్నేహితులు, నా భర్త కూడా ఏవో ఏర్పాట్లుచేస్తున్నారు.’ అని తెలిపింది.

 

పెళ్లై ఐదేళ్లయినా పిల్లలులేకపోవడం విషయంపై విద్య స్పందిస్తూ.. ‘ఇప్పటికైతే పిల్లల కోసం సమయం లేదు. నా సినిమాలే నా పిల్లలు. అంటే నా జీవితంలో 20 మంది పిల్లలున్నారు. ఇప్పుడు నా ధ్యాసంతా కేవలం సినిమాలపైనే ఉంది.’ అని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది విద్య ‘బేగం జాన్‌’, ‘తుమారీ సులు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బేగం జాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద డీలా పడిపోయింది. కానీ ‘తుమారీ సులు’ చిత్రం మాత్రం రూ.50 కోట్లకు పైగా వసూలు చేసింది.

loader