వివాదాస్పదంగా మారిన సీ.బీ.ఎఫ్.సీ చైర్మన్ నిహ్లానిని తొలగించిన కేంద్రం కొత్త కమిటీలో విద్యాబాలన్, గౌతమి, జీవిత రాజశేఖర్ బాలీవుడ్ హాట్ బాంబ్ విద్యాబాలన్ చేతిలో సెన్సార్ కత్తెర పడటం విశేషం
కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లాజ్ నిహ్లానీని కేంద్ర సర్కారు సెన్సార్ బోర్డు ఛైర్ పర్సన్ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ప్రముఖ కవి., రచయిత ప్రసూన్ జోషిని ఛైర్మన్‌గా నియమించింది. తాజాగా కొత్త ప్యానెల్ లో.. సీనియర్ నటి గౌతమిని సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. సెన్సార్ బోర్డులో గౌతమితోపాటు జీవిత రాజశేఖర్, జాతీయ అవార్డ్ గ్రహీత విద్యాబాలన్, వివేక్ అగ్నిహోత్రి, టీఎస్ నాగభరన, వాణి త్రిపాఠి టికూ, నరేంద్ర కోహ్లీ, నరేష్ చంద్రలాల్, నీల్ హార్బర్ట్, వామన్ కేంద్రే, రమేష్ పతంగె వంటి ప్రముఖులు సభ్యులుగా వున్నారు.
నిహ్లానీ పదవీ కాలం 2018 జనవరిలో ముగియాల్సి ఉన్నా... వివాదాస్పద చైర్మన్ గా మారటంతో కేంద్రం ఆయన్ను పదవి నుంచి తప్పించింది. నిహ్లానిని తొలగించిన కొద్దిసేపటికే కొత్త సభ్యుల జాబితాను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
కొత్త బోర్డులో గౌతమి., నరేంద్ర కోహ్లీ., నరేష్ చంద్ర లాల్., నీల్ హెర్బట్ నంజీరి., వివేక్ అగ్ని హోత్రి., వామన్ కేండ్రే., విద్యా బాలన్., టి ఎస్ నాగభరణ., రమేష్ పతంగే., వాణి త్రిపాఠి., జీవిత రాజశేఖర్., మిహిర్ భూట ల తో మూడేళ్ళ కాలానికి సెన్సార్ బోర్డు ని ప్రకటించారు. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్, తెలుగు హీరోయిన్లు గౌతమి, జీవిత రాజశేఖర్ లు సెన్సార్ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.
నిన్నటి వరకు తన అందాల ప్రదర్శనతో సెన్సార్ బోర్డు కత్తెరకు పని పెట్టిన విద్య చేతికి ఇప్పుడదే కత్తెర పట్టుకోవాల్సి రావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవలే ‘బేగంజాన్'లో హాట్, బోల్డ్ సీన్స్ తో సెన్సార్ బోర్డుకు విద్యాబాలన్ పెద్ద షాకిచ్చింది. ‘బేగంజాన్'కు ఏకంగా 12 కట్స్ వేసింది సెన్సార్ బోర్డ్. అలాగే విద్యా చెప్పిన కొన్ని డైలాగ్స్ ను కూడా వాయిస్ డౌన్ చేసింది. మరికొన్ని డైలాగ్స్ కు బీప్ సౌండ్ పెట్టాలని కూడా సూచించింది. గతంలో ‘డర్టీ పిక్చర్' ట్రైలర్ విడుదలవగానే పెద్ద హడావిడే జరిగింది. మోతాదుకు మించి సెక్సీ సీన్స్ ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. సెన్సార్ బోర్డు కత్తెర అందుకోకపోతే థియేటర్‌లో కూర్చోగలమా..? అన్నారంతా. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. పేరుకే ‘డర్టీ పిక్చర్' అయినా మంచి ఎమోషన్స్ ప్రజెంట్ చేసింది ఈ సినిమా. విద్యాబాలన్ నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. కలెక్షన్స్ పరంగానూ దుమ్ము రేంపింది. . స్వచ్ఛభారత్ లాంటి కొన్ని ప్రకటనలతోనూ అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు ప్రజాధారణను పొందింది విద్యాబాలన్. ఈ కోవలోనే సెన్సార్ బోర్డులో ఆమెకు ఛాన్స్ దక్కిందని చెప్పొచ్చు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని విద్య చెప్పింది. సమాజంలో వాస్తవాలను, కష్టాలను, సున్నితమైన విషయాలను ప్రతిబింబించే సినిమాలను అనుమతించే చోట పనిచేయడం చాలా ఉద్వేగాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది.
