డర్టీ పిక్చర్ తో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయిన బాలీవుడ్ బామ విద్యాబాలన్ కమలాదాస్ జీవితంపై తెరకెక్కుతున్న చిత్రంలో టైటిల్ రోల్ కు విద్య సినిమా నుంచి అర్థంతరంగా వైదొలగిన విద్యాబాలన్ విద్యా బాలన్ వైఖరితో నష్టపోయామంటూ కోర్టుకెక్కిన నిర్మాత
డర్టీ పిక్చర్ తో బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా సత్తాచాటింది విద్యాబాలన్. అమాంతం విద్య క్రేజ్ పెంచేసిన ఆ సినిమా తర్వాత ఆమెకు ఆ తరహా పాత్రలు తరచూ ఆఫర్ చేస్తూనే ఉన్నారు దర్శక నిర్మాతలు. అలా వచ్చిందే కమలాదాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఆమీ చిత్రం. ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించేందుకు సిద్ధమైన విద్య కథలో స్వల్ప మార్పులు చేయడంతో ఆమె ఆ ప్రాజెక్టులోంచి తప్పుకుంది. దీంతో లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు సదరు దర్శక నిర్మాతలు. అలా విద్యాబాలన్ చిక్కుల్లో పడింది.
రచయిత్రి కమలాదాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఆమీ చిత్రంలో నటించేందుకు ముందు విద్యాబాలన్ ఒకే చెప్పింది. కానీ విభేదాల కారణంగా చివరి నిమిషంలో ఈ సినిమాను చేయడం లేదని తేల్చేసింది. చివరి నిమిషంలో విద్యాబాలన్ హ్యాండివ్వటంపై దర్శకనిర్మాతలు చాలా గుర్రుగా ఉన్నారు.
కథను అనుసరించి చివరి నిమిషంలో స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. కొత్త స్క్రిప్ట్ ఆమెకు నచ్చలేదు. కానీ ఒప్పించేందుకు ప్రయత్నించాం. అయినా మా ప్రయత్నం సఫలం కాలేదని చిత్ర డైరెక్టర్ కమల్ తెలిపారు. ఆమెకు ఈ పాత్ర కష్టమైంది. ‘చాలా ప్రభావవంతమైన పాత్రలో ఒదిగిపోవడం విద్యాబాలన్‌కు పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ పాత్రను వదులుకుంది. ఈ చిత్రం కోసం ఎక్కువ సమయం కేటాయించకలేకపోవడం మరో సమస్య. పాత్ర తీరుతెన్నుల గురించి జరిగే డిస్కషన్ కోసం అందుబాటులోకి రావడం లేదు' అని ఆయన అన్నారు.
విద్యాబాలన్ వ్యవహార శైలితో నిర్మాతలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఆమె ఈ చిత్రం నుంచి వైదొలగడం వల్ల సినిమా బిజినెస్ దెబ్బతింది. ఇప్పటికే నిర్మాత ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆమె నిర్వాకంతో మళ్లీ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకొంటాం. అని నిర్మాతలు మండిపడుతున్నారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
