షూటిింగ్ పూర్తి చేసుకున్న విక్టరీ వెంకటేశ్ గురు జనవరి నెలాఖరులో రిలీజజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న టీమ్

విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం గురు షూటింగ్ పూర్తి చేసుకుంది. అవార్డ్ విన్నింగ్ త‌మిళ్ సూప‌ర్ హిట్ ఫిల్మ్ ఇరుదు సుత్త్ రు చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రమే విక్ట‌రీ వెంక‌టేష్ తాజా చిత్రం. ఈ చిత్రానికి సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ బాక్సింగ్ కోచ్ గా న‌టిస్తున్నారు.

ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. వ‌చ్చేవారం డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

వై నాట్ స్టూడియోస్ బ్యాన‌ర్ పై శ‌శికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రితికా సింగ్ మరియు ముంతాజ్ ఒరిజిన‌ల్ మూవీలో న‌టించిన పాత్ర‌ల‌నే ఈ చిత్రంలో కూడా పోషిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి... ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి నెలాఖ‌రున రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.