కెరీర్‌లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నహీరో నారా రోహిత్. ప్రస్తుతం 'వీర భోగ వసంత రాయలు' అనే సినిమా చేస్తున్నాడు రోహిత్‌. మల్టీ స్టారర్ గా రూపొందుతున్నఈ చిత్రంలో సుధీర్ బాబు, శ్రీ విష్ణు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అప్పారావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి ఇంద్రసేన దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోల గెటప్స్ ని రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేశారు. హీరోయిన్ శ్రియ సీరియస్ లుక్స్ తో ఆడియన్స్ ని మరింతగా మెప్పించింది.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. అక్టోబర్ 26న డేట్ ని లాక్ చేశారు. నిజానికి ఈ నెల మొత్తం బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు మాములుగా ఉండదు. ఈరోజు రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. వచ్చే వారం 'అరవింద సమేత' సందడి చేయనుంది. 

దాని హవా కనీసం రెండు వారాలు తిరుగు లేకుండా సాగుతుంది. ఆ తరువాత రామ్ 'హలో గురు ప్రేమకోసమే' అలానే 'పందెంకోడి 2' సినిమాలు విడుదల కానున్నారు. దీంతో 'వీర భోగ వసంత రాయలు' అక్టోబర్ ఆఖరి వారాన్ని బుక్ చేసుకుంది. 

ఇవి కూడా చదవండి.. 

ప్రణయ్ కోసం సినిమా పాట!

రామెజిఫిల్మ్ సిటి లో సుధీర్‌బాబు పాత్ర‌తో ప్రారంభ‌మైన 'వీర భోగ వ‌సంత రాయ‌లు' షూటింగ్‌

గుండు,టాటూలు కాదు.. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నాడు!