Asianet News TeluguAsianet News Telugu

Ennenno Janmala Bandham: యష్ దాంపత్య జీవితంలో లోపం.. వేదని గదిలో బంధించిన విన్ని?

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అందరి హృదయాలను దోచుకుంటూ మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. అనురాగం ఉన్నా, పలు కారణాల వల్ల దగ్గర కాలేకపోతున్న ఓ జంట కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Vedaswini feels happy as Yash helps her to complete the ritual in todays Ennenno Janmala Bandham serial gnr
Author
First Published Mar 21, 2023, 11:57 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో తను పెట్టిన కాయిన్ నిలబడకపోవడంతో డిసప్పాయింట్ అవుతుంది వేద. నేను ఖుషి కోసమే ఆయన జీవితంలో అడుగు పెట్టాను కానీ జీవితాంతం ఆయనతోనే కలిసి ఉండాలి అనుకుంటున్నాను కరుణించు అంటూ దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ కాయిన్ నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంది వేద.

ఆ కాయిన్ నిలబడదు మీ బంధం కూడా నిలబడదు అనుకుంటాడు విన్ని. ఈ తులాభారం వేస్తే నిజంగానే కోరుకున్న కోరికలు తీరుతాయా అని పంతులు గారిని అడుగుతాడు విన్ని. తీరుతాయి బాబు ఇదే తులాభారంతో రుక్మిణి శ్రీకృష్ణుడిని దక్కించుకుంది. ఇద్దరూ జన్మజన్మలకి కలిసి ఉంటారు అంటారు పూజారి. ఈ జన్మలోనే విడదీయాలని చూస్తుంటే జన్మజన్మలకి కలిసి ఉండటమా అనుకుంటాడు విన్ని.

పంతులుగారు ఇంకా ఏదో చెప్తుంటే నాకు బాగా అర్థమైంది ఇంక చాలు అంటాడు విన్ని. తూగితేనే కదా ఒకటి అయ్యేది, నాకు తూగవలసిన వేద వేరే ఎవరికో తూగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అస్సలు తూగనివ్వను అంటూ అక్కడ కొన్ని బెల్లం దిమ్మలు తీసేస్తాడు విన్ని. అంతలోనే అక్కడికి సులోచన, మాలిని వస్తారు. మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు మీకోసమే ఇక్కడ వెతుకుతున్నాను.

ఎప్పుడెప్పుడు తులాభారం చూద్దామా అని నాకు ఆత్రుతగా ఉంది అంటాడు విన్ని. మరోవైపు యష్ కూడా చేయి కలిపి కాయిన్ నిలబడే లాగా చేస్తాడు. ఎంతో ఆనంద పడిపోతుంది వేద. విన్ని మాత్రం కోపంతో రగిలిపోతాడు. 100 కోట్ల లాటరీ తగిలినట్టు ఎందుకలా ఫీల్ అయిపోతున్నావు ఏమైంది అంటాడు విన్ని. అంతకన్నా విలువైనది దొరికింది నేను ఏం కోరుకున్నానో అది నెరవేరేలాగా దేవుడు దీవించాడు.

కాయిన్ నిలబడింది అంటూ ఆనందంగా చెప్తుంది వేద. తులాభారానికి టైం అవ్వటంతో అక్కడినుంచి బయలుదేరుతారు వేద దంపతులు. వెళ్లండి వెళ్లండి మళ్లీ తురాభావం తోక పోతే తేడా వస్తుంది అనుకుంటూ ఆ కాయిన్  పడగొట్టేస్తాడు విన్ని. మీరు అనుకున్నట్లు కలిసిపోతే వేల మైళ్ళు దూరం దాటి నేను ఇక్కడి వరకు రావటం ఎందుకు అనుకుంటూ వేదతో ఏడడుగులు నడిచి ఏడు సముద్రాలు దాటి అమెరికా  తీసుకువెళ్లిపోవాలి.

నన్ను బ్లెస్స్ చేయి అనుకుంటూ కాయిన్ నిలబెట్టడానికి ట్రై చేస్తాడు విన్ని. కానీ ఎన్నిసార్లు ట్రై చేసిన వర్క్ అవుట్ అవ్వదు. అప్పుడు మట్టిని తెచ్చి ఆ మట్టిలో నుంచో పెడతాడు విన్ని. కాయిన్ నిలబడటం చూసి ముందు మంచిగా చెప్తాను వినకపోతే నా స్టైల్ లో చెప్పి సొంతం చేసుకుంటాను అని కసిగా అనుకుంటాడు విన్ని.

మరోవైపు తులాభారం ఎందుకు వేస్తారు అని అమ్మమ్మ, నాన్నమ్మ ని అడుగుతుంది ఖుషి. మీ అమ్మ నాన్న మధ్య ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి అంటుంది మాలిని. తులాభారం అంటే బరువుని కొలిచేది కాదు మనసుని కొలిచేది అంటూ కృష్ణ తులాభారం గురించి చెప్తుంది సులోచన. ఇప్పుడు ఈ బెల్లం తో నాన్నని తూస్తారా అని అడుగుతుంది. అవును ఎంత బెల్లంతో చూస్తే అంత బెల్లాన్ని దేవుడికి సమర్పిస్తారు అంటుంది సులోచన ఒకవేళ తూగకపోతేనో అంటాడు విన్ని.

అలాంటి అపశకునం మాటలు మాట్లాడకు తప్పకుండా తూగుతారు అంటుంది సులోచన. అలా అని నాకు తెలియదు కదా ఆంటీ ఒకవేళ తూగకపోతే అందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలి కదా అందుకే అడిగాను అంటాడు విన్ని. ప్రేమ లేని వారికి బంధాలను మధ్యలో వదిలేసి వెళ్లిన వారికి తూగదు. బంధాలకి విలువ ఇచ్చేవారు తప్పకుండా తూగుతారు అంటుంది మాలిని.

ఎంత బంధం ఉన్న బరువు తగ్గ బెల్లం లేకపోతే తూగరు నేను కొంచెం బెల్లం దాచేసాను కదా అనుకుంటాడు విన్ని. మరోవైపు పూజారి గారు ఈ తులాభారం అతి ప్రాచీనమైన సాంప్రదాయం. ఒక విధంగా చెప్పుకోవాలంటే భార్యాభర్తల అనురాగానికి, అన్యోన్యతకి ప్రతీక ఈ తులాభార సాంప్రదాయం. ఈ తులాభారం బెల్లంతో గాని, బంగారంతో కానీ, ధాన్యంతో గాని మన సానుకూలతను బట్టి వెయ్యొచ్చు.

దంపతుల మధ్య అనుకూలత వృద్ధి చెందుతాయి అంటూ తులాభారం గురించి విడమర్చి చెప్తారు పంతులుగారు. వేద భర్తకి హారతి ఇచ్చి బొట్టు పెడుతుంది. త్రాసుకి దండం పెట్టుకొని త్రాసులో కూర్చుంటాడు యష్. తులసి మాల సిద్ధం చేశారా అని మరో పూజారి అడిగితే లేదు అంటుంది వేద. ఈ పూజకి తులసి మాల ముఖ్యమైనది. తులసిమాలని శ్రీకృష్ణ పరమాత్మునికి సమర్పించిన తర్వాతే పూజ మొదలుపెట్టాలి వెళ్లి మాల తీసుకురండి అంటారు పంతులుగారు.

సులోచన వెళ్ళబోతుంటే పూజ చేసేది ఆవిడే కదా ఆవిడనే వెళ్ళండి అనటంతో మాల తీసుకురావడానికి వెళ్తుంది వేద. ఆమె వెనకే వెళ్తాడు విన్ని. అక్కడే వున్న ఓ గదిలోకి వెళ్లి ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. వెనకగా వెళ్లిన విన్ని డోర్ ని బయటనుంచి లాక్ చేసేస్తాడు. వేద ఎంతకీ రాకపోవడంతో ఏం జరిగిందో అని కంగారుపడుతుంటారు మాలిని, సులోచన.

మరోవైపు డోర్ క్లోజ్ అవ్వడానికి చూసి షాక్ అవుతుంది వేద. ఎవరైనా ఉన్నారా అంటూ లోపలి నుంచి పిలుస్తుంది. తరువాయి భాగంలో అందరూ ఒకటి కావాలన్నా మీ కోరిక తీరకూడదు ఈ తులాభారం జరగకూడదు అనుకుంటాడు విన్ని. నువ్వు ఎంతసేపు కూర్చున్న శుద్ధ దండగ మీ దాంపత్యంలో ఏదో లోపం ఉన్నట్లుంది. ఇంక ఈ కార్యక్రమం కొనసాగించడం అనవసరం అంటారు పంతులుగారు.

Follow Us:
Download App:
  • android
  • ios