Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 28వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందా.
ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి, వేదకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు విన్నీ యష్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే పనులు జరగవు ఏ పనికైనా కూడా సైలెంట్ గా ప్రశాంతంగా చెప్పాలి అని నవ్వుతూ చెబుతాడు. అప్పుడు ఖుషి అమ్మ విన్నీ అంకులే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అంకుల్ థాంక్యూ సో మచ్ అని అంటుంది. అప్పుడు చాలా థ్యాంక్స్ విన్నీ అని అనడంతో యష్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విన్నీ డాక్టర్ తో మాట్లాడుతూ ఉండగా యష్ కోపంగా విన్నీ దగ్గరికి వెళ్తాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి వివిన్. ఈ పనులు నువ్వు చూసుకో లేవా అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ ఇప్పుడు నేనేం చేశాను అని అంటాడు విన్నీ.
నా కూతుర్ని తీసుకురానికి నువ్వు ఎవరు. వేద ముందు ఖుషి ముందు మార్కులు కొట్టేయాలని చూస్తున్నావా అని అంటాడు. ఇప్పుడు యష్, విన్నీ ని అర్థం చేసుకోకుండా నోటికి వచ్చిన విధంగా తిడుతూ ఉంటాడు. అప్పుడు విన్నీ యశోద నువ్వు మాట్లాడే పద్ధతి ఏమీ బాగోలేదు వేద ఫాస్టింగ్ చేయడం వల్ల తనకి ఈ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు డాక్టర్ తినమని చెబుతున్న తను తినలేదు అందుకే క్యూస్షన్ తీసుకొని వచ్చాను అని అంటాడు విన్నీ. కానీ ఖుషి ఎవరు నా కూతురు ఖుషి నా కూతురు వేద నా భార్య మధ్యలో నువ్వు ఎవరు నీ పెత్తనం ఏంటి అని అంటాడు. నేను చెప్పేది విను యశోదర్ అనడంతో నేను వినను నువ్వు చెప్పేది నువ్వు విను అని మొండిగా ప్రవర్తిస్తాడు.
నాకంటే నీకే వేద మీద శ్రద్ధగా ఉందా అలాంటప్పుడు ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు వేద వాళ్ళ అమ్మకి ఆక్సిడెంట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్లావు ఇప్పుడు ఉన్న ఫలంగా ఊడిపడి లేనిపోని ప్రేమను కురిపిస్తున్నావు అంటూ విని గురించి నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. పెళ్లి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు ఎందుకు వచ్చావు పెళ్లయిన అమ్మాయిని ఎందుకు విసిగిస్తున్నావు అంటూ విని తప్పుగా అపార్థం చేసుకుని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు విన్నీ అయిపోయిందా ఇంకా మాట్లాడాల్సింది ఏమైనా ఉందా అని అంటాడు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు యష్. ఇలా గట్టిగా మాట్లాడి అరిస్తే పెద్ద మగాడివి అనుకుంటున్నావా అనడంతో యష్ ,విన్నీ వైపు కోపంగా చూడగా ఏం కోపం వచ్చిందా అని అంటాడు.
వేద నీ భార్యని అందుకు ఒప్పుకుంటాను తను నీ భార్యగా మీ ఇంటి కోడలిగా నీ బిడ్డకు తల్లిగా అన్ని చేస్తోంది మరి నువ్వు నీ వేద కోసం ఏం చేస్తున్నావు అని అడుగుతాడు విన్నీ. నీకోసం అన్ని చేసిన వేదా కోసం నువ్వు ఏం చేశావు. పట్టించుకోకుండా ఉన్నావు అనడంతో పట్టించుకోకపోతే ఇప్పుడు హాస్పిటల్ కి ఎవరు తీసుకువచ్చారు అని అంటాడు యష్. నువ్వు ఏంటి చేసేది కాపురం అయినా దానికి కాని దానికి వేద మీద సీరియస్ అవ్వడమే కాపురం అంటారా అని అంటాడు. పెళ్లయి ఇన్ని రోజులు అయింది వేద గురించి నీకేం తెలుసు తెలుసుకునే ప్రయత్నం అయినా చేసావా అని నిలదీస్తాడు విన్నీ. తనకు ఏది ఇష్టం ఏది వద్దు అన్న విషయాలు ఏమైనా కనుకున్నావా అని అంటాడు. నీ నుంచి వేద ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించావా అని నిలదీస్తాడు విన్నీ.
భార్యాభర్తలు అంటే కలిసి బెడ్ షేర్ చేసుకోవడం బాధలు షేర్ చేసుకోవడం కాదు ఇట్స్ ఏ బాండ్ బంధం అని అంటాడు విన్నీ. అప్పుడు యష్ ఏయ్ అనగా వెయిటే ఏ మినిట్ నేను చెప్పేది విను అని అంటాడు విన్నీ. నువ్వు ఒక స్వార్ధ పరుడువి యశోదర్ నీ గురించి నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తావు కానీ ఎప్పుడైనా వేద గురించి ఆలోచించావని గట్టిగా నిలదీసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు విన్నీ. ఆ తర్వాత వేద వాళ్ళ అమ్మ చిత్ర అందరూ హాస్పిటల్ కి రావడంతో అందరూ వేద ని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఇప్పుడు విన్నీ మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్పాలి గంట గంటకి వాష్ రూమ్ కి వెళ్లి కన్నీళ్లు తుడుచుకుని వచ్చింది ఎవరో తెలుసా అనడంతో అప్పుడు వర్మ ఏంటి విన్నీ ఇలా అందరి ముందు చెప్పినా పరువు తీస్తావా అనడంతో అందరూ నవ్వుకుంటూ ఉంటారు.
అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చిత్ర వసంత్ ఇద్దరూ కలిసి యష్ బాధపడిన విషయం గురించి చెప్పడంతో వేద సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా సమస్యలన్నీ తీరిపోయాయి నాకున్న బాధ్యతల్లా ఒకటే నీకు వసంత్ కి పెళ్లి చేయడం అనడంతో ఆ రోజు కోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం అక్క అని అంటారు వసంత్, చిత్ర. ఆ తర్వాత యశోదర్ విన్నీ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇది విన్నీ అన్న మాట నా లేక వేద మనసులోని మాటలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు యశోదర్. అయినా వాడి మాటలు పట్టించుకోవడమేంటి నేను వేదకి మంచి భర్తనే ఇప్పటికీ అలాగే ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు.
ఇంతలో ఖుషి అక్కడికి వచ్చి అమ్మ పిలుస్తోంది రండి డాడీ అనడంతో యష్, ఖుషి నేను మీ మంచి డాడిని కాదా అనగా కాదు నువ్వు నా బెస్ట్ డాడీ వి అనడంతో అప్పుడు వాళ్ళిద్దరూ హత్తుకొని సంతోష పడుతూ ఉంటారు. తర్వాత వేద దగ్గరికి యష్ వెళ్లి కోపంగా మాట్లాడగా ఆ తర్వాత విన్నీ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని కూల్ గా నవ్వుతూ వేదన్ని పలకరిస్తాడు. అప్పుడు వేద కూడా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆలస్యం ఎందుకు నామీద అరవండి అనగా ఇకపై నుంచి నీ మీద అరవను. కోపం లేదు ఏమీ లేదు అని అంటాడు యశోదర్. అప్పుడు యష్ పదేపదే విన్నీ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు అరుస్తూ కోపంగా ఉంటేనే బాగుంటుంది ఇలా ఉంటే ఏదో కోల్పోయినట్టు ఉన్నారు అనగా యష్ నవ్వుతూ ఉంటాడు.
