Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి కీ దగ్గరగా జరిగి రిషి చెయ్యి పట్టుకుని నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను బాధ పెడుతున్నాను. నేను కావాలని ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టలేదు కానీ నేను చేసిన పనులు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. మిమ్మల్ని చాలా వేదనకు గురి చేస్తున్నాయి. చెప్పండి సార్.. అందుకోసం నేను ఏం చేయాలి చెప్పండి సార్ అనగా.. అదే నేను కూడా అడుగుతున్నాను ఇవన్నీ మర్చిపోవాలి అంటే ఏం చేయాలి అని అంటాడు రిషి. నిన్ను నేను ఇంతకుముందు చూసినప్పుడు నాకు ఫీలింగ్ కలిగేది నేను ఆ ఫీలింగ్ కావాలని కోరుకుంటున్నాను అని అంటాడు రిషి.

 నేను నీతో మాట్లాడినప్పుడు నా హార్ట్ బీట్ ఎలా ఉండేదో ఇప్పుడు నేను వినాలి అనుకుంటున్నాను అని అంటాడు. అవన్నీ నాకు ఇవ్వగలవా అని అడుగుతాడు రిషి. నా మనసు ఆందోళన పడి పడి ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఇప్పుడు చల్లగాలి లాంటి పాత పరిచయాన్ని కోరుకుంటోంది ఇవ్వగలవా వసు అని అనగా సార్ మీరు కోరుకున్నట్టు మనిద్దరం మళ్ళీ ఎప్పటిలాగే ఉండాలి అంటే మన రిలేషన్ మళ్ళీ కొత్తగా మొదలవ్వాలి అని అంటుంది. నేను మొదటిసారి కాలేజీకి వచ్చినప్పుడు మీరు నాతో ఎలా ఉండేవారు ఇప్పుడు అలాగే ఉండండి అని అంటుంది. ఇద్దరం ఒకరికొకరు కొత్తగా ఉందాం. ఫ్రెష్ రిలేషన్ స్టార్ట్ చేద్దాం అని అంటుంది.

 ఇప్పటివరకు జరిగినవన్నీ మర్చిపోమంటావా అనగా గుర్తుపెట్టుకోవద్దండి సార్ ఒకవేళ గుర్తుకు వచ్చిన మైండ్ లో నుంచి వాటిని తీసేయండి అని అంటుంది వసుధార. నువ్వు చెప్పేది సాధ్యపడుతుందా అని అడగగా ఎస్ సార్ మనం సాధ్యం చేద్దాం అని అంటుంది వసుధర. రేపటి నుంచి మన కొత్త ప్రయాణం మొదలవుతుంది రేపే మనం మొదటిసారిగా కలుసుకోబోతున్నాం సార్ అని అనడంతో రిషి ఆలోచనలో పడతాడు. అప్పుడు రిషి వసుధార మాటలకు సంతోషపడి సరే రేపటి నుంచి మనం కొత్త రిలేషన్ ని మొదలుపెడదాం అని వసుధారకీ షేక్ అండ్ ఇస్తాడు రిషి.

అప్పుడు ఇద్దరు కూడా సంతోష పడుతూ ఉంటారు. రిషి చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు. మరోవైపు ఫణీంద్ర చాలా పెద్ద గండం తప్పింది దేవయాని రిషి చాలా తెలివైనవాడు డిబిఎస్టీ కాలేజ్ పరువు ప్రతిష్టలను కాపాడాడు. మా నాన్నగారి పరువు మర్యాదలను కాపాడారు అనడంతో అవును అన్నయ్య అని అంటాడు మహేంద్ర. ఇంతలోనే అక్కడికి రిషి వసుధార రావడంతో నాన్న రిషి నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది నాన్న అంటూ లేనిపోని ప్రేమలు ఒలకబోస్తూ ఉంటుంది దేవయాని. ఈరోజు నిన్ను అందరూ పొగుడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అనడంతో ఆ పొగడ్తలు చందాల్సింది నాకు కాదు పెద్దమ్మ వసుధారకి అని అంటాడు రిషి. 

అయ్యో నాదేముంది సార్ ఈ క్రెడిట్ అంతా జగతి మేడందే అనడంతో అప్పుడు పనింద్ర అందరూ అందరూ క్రెడిట్ ని ఒక్కరే కాకుండా అందరూ పంచుకుంటున్నారు అని అనడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. తర్వాత రిషి వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార నువ్వు చెప్పినట్టుగా మనం కొత్త రిలేషన్ స్టార్ట్ చేయడానికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ రిషి పాత ఇలా మారబోతున్నాడు అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు మరొకవైపు వసుధార కూడా నేను పాత వసుధారని అవుతాను.

ఈ టైం ట్రావెల్ ప్లాన్ బాగుంది నేను రిషి సార్ మళ్లీ గతానికి వెళ్తున్నాము అని సంతోషపడుతూ ఉంటుంది. మొదట రిషి సార్ ని చూసినప్పుడు నాలో ఎటువంటి ఫీలింగ్ లేదు కానీ ఆ తర్వాత తనే నా ఫీలింగ్ అయ్యాడు నా ప్రాణం అయ్యాడు అని అనుకుంటూ ఉంటుంది. ప్రపంచంలో ఇంతమంది ఉండగానే నేను మీ లైఫ్ లోకి ఎందుకు వచ్చానో నాకు తెలియదు. మీరే నా లైఫ్ అయ్యారు అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు తన తాళి వైపు చూసుకుంటూ మీ అంగీకారం లేకుండా మీరు కట్టినట్టుగానే ఊహించుకొని ఈ తాళి వైపు నా మెడలో వేసుకున్నాను అనుకుంటూ ఉంటుంది. 

మరోవైపు రిషి కూడా గడియారం వైపు చూస్తూ ఉంటాడు. మరి కొద్దిసేపట్లో నేను పాత రిషిగా మారబోతున్నాను ఈ లోపు వసుధారని తెలవాలి అని గడియారంలో ఆఫ్ చేసి వసుధార ని కలవడానికి వెళ్తాడు. మరోవైపు వసుధార కూడా రిషి సార్ ని కలవాలి అని బయలుదేరుతుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడి ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి వసుధార మనం అనుకున్నట్టుగా చేయగలమా అనగా నా మనసు కూడా అదే అడుగుతోంది సార్ అని అంటుంది వసుధార. కఠినమైన నిర్ణయాలు, ఎన్నో జ్ఞాపకాలను మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టడానికి సిద్ధపడుతున్నాము అని అంటాడు రిషి.

మన ప్రేమకు కాలం మళ్ళీ పరీక్ష పెడుతోంది అందులో మనం నెగ్గాలి అనడంతో అవును సార్ అని అంటుంది వసుధార. రిషి ధార వేరు వేరు కాదు ఒక్కరే అని అంటుంది వసుధార. రేపటి నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఒకప్పటి వసుధార రిషి లు ఉంటారు. ఆ తర్వాత యధావిధిగా ఇప్పటి వసుధార రిషిలు ఉంటారు అని అంటాడు రిషి. మనం ఇప్పటిలాగే ఉందాము మన ఒప్పందం గురించి ఎవరికీ చెప్పకూడదు అని అంటున్నాడు రిషి. అప్పుడు ఇద్దరు ఒకరికి ఒకరు షేక్ హాండ్ ఇచ్చుకొని బెస్ట్ ఆఫ్ లక్ చెప్పుకుంటారు. ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా వసుధార వెనుక వైపు నుంచి గట్టిగా హత్తుకుంటుంది. అప్పుడు రిషి వసుధర ఏంటిది అనగా ప్రేమ సార్ అని అంటుంది.