Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు మార్చి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని మీరేం మాట్లాడకండి నేను చెప్పేది వినండి. అంతమందిలో ఆ వసుధారా నా భార్య అని చెబుతాడా అంటూ కోపంతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. అసలు అలా ఎలా మాట్లాడుతాడు అండి మన పెద్దరికం ఏమి అవ్వాలి అలా మాట్లాడవచ్చా అని అంటుండగా పెద్దమ్మ అని లోపలికి వస్తాడు రిషి. నువ్వు నాతో మాట్లాడకు రిషి నేను నీతో మాట్లాడను అనగా అప్పుడు ఫణీంద్ర మీ పెద్దమ్మకు నీ మీద కోపం వచ్చింది రిషి. కోపం కాదండి ఈ చేతులతో పెంచు పెద్ద చేశాను అనగా పెద్దమ్మ నేను మాట్లాడే మాటలు మీకు కోపం తెప్పిస్తాయని బాధ తెప్పిస్తాయని తెలుసు అయినా కూడా మాట్లాడాల్సి వచ్చింది అని అంటాడు.
తెలిసీ కూడా మళ్ళీ ఎందుకు ఇలా చేశావు రిషి అని నిలదీస్తుంది. నేను అలా మాట్లాడానికి కారణాలు ఉన్నాయి ఆ వివరాలు నేను ఇప్పుడు చెప్పలేను అని అంటాడు రిషి. కావాలంటే జగతి మేడం ని అడిగితే తెలుస్తుంది అని అంటాడు. ఏది ఏమైనప్పటికీ నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు దేవయాని దొంగ నాటకాలు ఆడుతూ నా రిషి నేనా ఇలా మాట్లాడింది అనగా నేను ఎప్పటికీ మీ రిషినే. నన్ను దూరం పెట్టకండి నన్ను బాధ పెట్టకండి పెద్దమ్మ అని అంటాడు. లేదు నాన్న నువ్వు అక్కడ అలా మాట్లాడేసరికి కోపం వచ్చింది అందుకే అలా మాట్లాడాను అని అంటుంది దేవయాని. అప్పుడు రిషి, ఇద్దరు ఒకటి అవుతారు.
మరొకవైపు జగతి వసుధార మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు వసు అవును మేడమ్ నలుగురిలో వసుధార నా భార్య అని ఒప్పుకున్న రిషి సార్ నాలుగు గోడల మధ్యకు వెళ్ళగానే మాట మార్చేశారు అనడంతో జగతి ఆశ్చర్య పోతుంది. ఏంటి మేడం అసలు ఇది రిషి సార్ ఒప్పుకున్నట్టా లేదా అలాంటప్పుడు ఒప్పుకోకుండా ఉండాల్సింది కదా మేడం అని బాధగా మాట్లాడుతుంది వసుధార. రిషి సార్ కోపమేంటో సంతోషం ఏంటో ఇప్పటికి నేను అర్థం చేసుకోలేకపోయానేమో అని నాకు అనిపిస్తోంది మేడం అంటుంది వసుధర. అప్పుడు జగతి వసుధార ధైర్యం చెబుతూ ఉంటుంది. ఈ సమస్యని పరిష్కరిస్తాను అని జగతి అక్కడ నుంచి వెళ్తుండగా మీరు వెళ్లి రిషి సార్ ని అడిగితే నేను సార్ మీద చాడీలు చెప్పానని అనుకుంటారు అని అంటుంది వసుధార.
అప్పుడు జగతి సరే అని నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జగతి కాఫీ పెడుతూ ఆ పాల గురించి పాల ఉత్పత్తుల గురించి ధరణికి వివరిస్తూ ఉంటుంది. మరొకవైపు వసుధర తాళిబొట్టుకి వి.ఆర్ అనే అక్షరాన్ని చూసి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జరిగిన విషయాలను తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు వసుధార గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు వసు నలుగురిలో నన్ను బతికించారు కానీ నాలుగు గోడల మధ్యలో నా మనసును చంపేశారు అనుకుంటూ మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రిషి వసుధార నువ్వు అందరికీ టాపిక్ కాకూడదు అనే నేను అలా సమాధానం చెప్పాను అని అనుకుంటూ ఉంటాడు రిషి.
అలా వసుధార రిషి ఇద్దరు ఒకే విధంగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు వసు విఆర్ అనే అక్షరం వైపు చూస్తూ ఎప్పటికి మనిద్దరం విడిపోకుండా ఇలాగే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ అని ఎమోషనల్ అవుతుంది. అక్షరాలు కలిసినంత మాత్రాన మనసులు కలుస్తాయా అని నన్ను ఈ అక్షరాలు నిలదీస్తున్నట్టు ఉన్నాయి సార్. మరోవైపు రిషి వసుధార నిన్ను శిక్షించేది నేను కాదు నీ నిర్ణయాలే అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార బాధపడుతూ ఉండగా ఇంతలో చక్రపాణి అక్కడికి రాగా ఏంటమ్మా ఫోన్ మాట్లాడుతున్నావా అనగా లేదు నాన్న అని అంటుంది వసుధార. మరొకవైపు జగతి, ధరణి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు.
ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ధరణి పై సీరియస్ అవుతూ ఉంటుంది. అప్పుడు ధరణి బాగానే మాట్లాడించిన దేవయాని వెటకారంగా సమాధానాలు చెబుతూ ఉంటుంది. అప్పుడు దేవయాని ఏం జగతి ఇంకేంటి విశేషాలు అనడంతో దేవయానికి రివర్స్లో కౌంటర్లు వేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంది జగతి. అప్పుడు అని మనసులో వసుధార ని తిట్టుకుంటూ ఉంటుంది. తర్వాత రిషి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. వసు గురించి మాట్లాడొచ్చా రిషి అని అంటుంది.
అప్పుడు రిషి ప్రతిదీ నా ర్మిషన్ తీసుకుని చేశారా ప్రతిదీ నా పర్మిషన్ తీసుకునే మీరు మాట్లాడారా అని అంటాడు. అప్పుడు గతంలో జరిగిన విషయాలు తలుచుకుంటుంది జగతి. ఆరోజు నువ్వు వసుధార ప్రేమిస్తున్న విషయం నేనే చెప్పాను. తర్వాత నీకు తెలియకుండా నీ అనుమతి లేకుండానే నేను తాళిబొట్టును పంపించాను అని అంటుంది జగతి. అప్పుడు రిషి తాళి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
