వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ.. ఫస్ట్ లుక్ విడుదల..క్రేజీ లుక్స్

వరుణ్ తేజ్ హీరోగా తొలిప్రేమ.. ఫస్ట్ లుక్ విడుదల..క్రేజీ లుక్స్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తనకంటూ ఒక మంచి మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. ఫిదా ఇచ్చిన సక్సెస్ తో కెరీర్ ను చక్కబెట్టుకోవాలని వరుణ్ చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటున్నాడు. ఆ సినిమా తర్వాత వరుణ్ కి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ రొటీన్ గా ఉండడంతో ఒకే చేయలేదు. అయితే వరుణ్ తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికే తొలిప్రేమ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన సినిమా తొలి ప్రేమ. అదే టైటిల్ తో వస్తున్న మూవీలోని ఓ సీన్ నుంచి తీసిన పిక్ లో ఒక స్టేషన్ బెంచీపై కూర్చుని.. క్లీన్ షేవ్ తో రిలాక్స్ డ్ గా ఉన్న వరుణ్ తేజ్ ఎట్రాక్టివ్ గా వున్నాడు.ఫారెన్ బ్యాక్ డ్రాప్ లో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను..నూతన దర్శకుడు వెంకీ అట్లూరి  తెరకెక్కిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

 

My next!😍😍😍 #tholiprema

A post shared by Varun Tej Konidela (@varunkonidela7) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos