ఊటీలో షూటింగ్ చేస్తుండగా వరుణ్ తేజ్ కాలికి గాయం. నెల రోజులకు పైగా బెడ్ రెస్ట్ తీసుకోన్న వ‌రుణ్  తాజాగా ఫిదా షూటింగ్ కి అటెండ్ అయిన వ‌రుణ్ లేజ్ 

ఇప్పుడు వరుణ్ బాగా రికవర్ అయ్యాడట అంతే కాదు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఫిదా షూటింగ్ కి కూడా అటెండ్ అయిపోయాడు.కామారెడ్డి దగ్గరలో బాన్స్ వాడలో ప్రస్తుతం ఫిదా షూటింగ్ జరుగుతోంది. హీరోయిన్ సాయిపల్లవితో కలిపి కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ తర్వాత హైద్రాబాద్ లో కొన్ని సన్నివేశాలు తీసి.. యూఎస్ లో సుదీర్ఘమైన షెడ్యూల్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. మధ్యలోనే మిస్టర్ షూటింగ్ ని ఫినిష్ చేసేస్తాడట వరుణ్ తేజ్.