విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ను తెరపైకి ఎప్పుడు తీసుకువస్తాడో గాని సినిమాకు సంబందించిన వార్తలతో సోషల్ మీడియాను మాత్రం బాగా వాడుకుంటున్నాడు. ఫైనల్ గా వర్మ లక్ష్మి పార్వతి పాత్రను చేస్తోన్న నటి గురించి చెప్పేశాడు. ఆమెకు సంబందించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వర్మ బయటపెట్టాడు.

 

ఆమె ఎవరో కాదు. కన్నడ నటి యజ్ఞా శెట్టి. లక్ష్మి పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన తరువాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనే అంశాలను వర్మ తన సినిమాలో చూపించబోతున్నాడు. సినిమాకు సంబందించిన రెండు పాటలను ఇదివరకే రిలీజ్ చేసిన వర్మ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక సినిమాలో నటిస్తోన్న పాత్రల నటీనటుల ఫస్ట్ లుక్స్ ని విడుదల చేసే పనిలో పడ్డాడు. 

అయితే ఈ యజ్ఞా శెట్టి అంతగా సెట్ అయినట్లు కనిపించడం లేదని కామెంట్స్ వస్తున్నప్పటికీ వర్మ స్క్రీన్ పై ఎలా చూపించబోతాడా అనే ఆసక్తిగా అందరిలో నెలకొంది. చంద్రబాబు అలాగే ఎన్టీఆర్ పాత్రలు చేసేవారి 'ఫోటోలను కూడా బయటపెట్టాల్సిందిగా వర్మను అభిమానులు కోరుతున్నారు.