లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతి పాత్రను అలా విడుదల చేశాడో 'లేదో వర్మ మరో పాత్రకు సంబందించిన ఫోటోను విడుదల చేశాడు. అది చంద్రబాబు క్యారెక్టర్ అని అందరికి తెలిసినప్పటికీ ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అంటూ తన ట్విట్టర్ లో ప్రమోట్ చేస్తున్నాడు. వైరల్ గా మారిన ఆ ఫొటోస్ చూస్తుంటే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పవచ్చు.

 

ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి పాత్రలో కనిపించిన శ్రీ తేజ్ ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు పాత్ర చేయడం విశేషం. అంతే కాకుండా గతంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటిలో కూడా శ్రీ నటించాడు. అందులో దేవినేని నెహ్రు రోల్ లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో కనిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజ జీవితాల్లో రాజకీయ నాయకుల పాత్రలకు శ్రీ తేజ్ బాగానే సెట్ అవుతున్నాడు. మరి సినిమాలో అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూడాలి.