వంశీ ఫ్యాషన్ డిజైనర్ సనాఫ్ లేడీస్ టైలర్ ట్రైలర్ విడుదల గోదారి అందాలతో ఆకట్టుకుంటున్న ట్రైలర్ ట్రైలర్ లో ఓ యువతి తడి అందాలను పరిచయం చేసిన టీమ్

దాదాపు 32 సంవత్సరాల తర్వాత సీనియర్ దర్శకుడు వంశీ తన 'లేడీస్ టైలర్' మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించిన సినిమా 'ఫ్యాషన్ డిజైనర్' . అప్పటి సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో లేకపోయినా... అవే లొకేషన్లలో ఈ సినిమాను తీశానని, ఆ మధురానుభూతులు ఇంకా తన మనసులో పచ్చిగానే ఉన్నాయని వంశీ చెబుతున్నారు.

గతంలో కొన్ని సినిమాలను నిర్మించి, దర్శకత్వం వహించిన 'మధుర' శ్రీధర్ 'ఫ్యాషన్ డిజైనర్' మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, 'వంశీ దర్శకత్వంలో సినిమా నిర్మించడం గొప్ప ఆనందాన్ని కలిగించిందని' అన్నారు.ఇక 'గతంలో నటించిన చిత్రాలకు దీనికి ఎంతో తేడా ఉందని, ఈ చిత్ర నిర్మాణ సమయంలో నటుడిగానే కాకుండా వ్యక్తిగానూ ఎంతో నేర్చుకున్నాన'ని సుమంత్ చెబుతున్నాడు... మణిశర్మ స్వరాలు అందించిన 'ఫ్యాషన్ డిజైనర్' మూవీని జూన్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ ఈ శనివారం రిలీజై ఓకే అనిపించుకుంది. నాటి లేడీస్ టైలర్ తరహాలో ఈ చిత్రాన్ని కూడా గోదారి అందాలు ప్రతిబింబిస్తూ అక్కడే చిత్రీకరించారు. గోదారి అందాలు ట్రైలర్ లో పలు చోట్ల కనిపిస్తుంటే.. తడి అందాలు ఆరబోస్తున్న ఓ యువతి నగ్న దృశ్యం మాత్రం అలా మెరిసి ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. ఆ తడి అందాలు ఎవరివో కానీ అద్భుతంగా తెరకెక్కించారు. అది హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ దే అని అంటున్నారు. మరి వంశీ ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో.