టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అందరూ ఒకే ఫ్రేములో కనిపించడం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి సోమవారం సాయంత్రం తన ఇంటికి అగ్ర దర్శకులందరినీ ఆహ్వానించి ప్రత్యేకంగా పార్టీను ఏర్పాటు చేశాడు. రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, క్రిష్, హరీష్ శంకర్, నాగ్అశ్విన్, సందీప్ రెడ్డి వంగ, అనీల్ రావిపూడి వంటి దర్శకులు ఈ పార్టీకు హాజరయ్యి సందడి చేశారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఈ అధ్బుతమైన వ్యక్తులతో ఎప్పటికీ గుర్తుండిపోయే సాయంత్రాన్ని గడిపాను. ఈ సాయంత్రాన్ని గుర్తుండిపోయేలా చేసిన రాజమౌళి, సుకుమార్, కొరటాల శివ, హరీష్ శంకర్, క్రిష్, అనీల్ రావిపూడి, సందీప్ రెడ్డి, నాగ్అశ్విన్ లకు ధన్యవాదాలు' అని వెల్లడించారు.

ప్రస్తుతం వంశీ పైడిపల్లి.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు గడ్డం, మీసంతో కనిపించనున్నారని సమాచారం. ఇక సుకుమార్, కొరటాల, రాజమౌళి తమ తదుపరి సినిమాల కోసం సిద్ధమవుతున్నారు. క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ తో, అనీల్ రావిపూడి.. వెంకీ-వరుణ్ ల మల్టీస్టారర్ తో బిజీ కానున్నారు.