మహేష్ 25వ చిత్రం అతనికే కాదు ఫ్యాన్స్ కి కూడా చాలా స్పెషల్. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  వంశీ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని అన్నీవిధాల మహేష్ కి ఈ చిత్రం గుర్తుండిపోయేలా ఉండాలని మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు వంశీ.


రీసెంట్ ఈ చిత్రం గురించి పిలింనగర్ లో ఒక గాసిప్ వినిపిస్తోంది. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సీరీస్ ని బేస్ చేసుకుని స్టోరీ తయారైనట్టు మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఉత్కంఠంగా ఉండేలా స్టోరీ తయారైనట్టు ఇదే మహేష్ వంశీ సినిమా లైన్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయాన్నే కొందరు ఫ్యాన్స్ వంశీని ట్విట్టర్ వేదికగా అడగారు. దీనికి వంశీ స్పందిస్తూ మహేష్ 25 ఏ సీరీస్ నుండి ఇన్స్ పైర్ కాలేదంటు ఇదంతా వట్టి గాసిప్స్ అని ఇలాంటి గాసిప్స్ ని సీరియస్ గా తీసుకోకండి అంటూ రిప్లై ఇచ్చాడు.