మహేష్ పాటను వాడేస్తున్నాడు!

vacchadayyo saami title confirmed for allari naresh movie
Highlights

భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సునీల్ లు కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న 

భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లరి నరేష్, సునీల్ లు కలిసి ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే.. అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందబోతుంది. దీనికి టైటిల్ గా 'సిల్లీ ఫెలోస్' అనే పేరుని అనుకున్నారు. జనాల్లోకి కూడా ఈ టైటిల్ బాగానే వెళ్లింది కానీ ఇప్పుడు టైటిల్ తో సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఓ ప్రొడక్షన్ హౌస్ ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించడంతో భీమనేని తన సినిమాకు టైటిల్ ను మార్చే పనిలో పడ్డాడు. 'సుడిగాడు2' అని పెడితే సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అది భీమనేనికి ఇష్టం లేక మరో టైటిల్ ను సినిమాకు కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాడు. అదే 'వచ్చాడయ్యో సామి.

రీసెంట్ గా మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో సామి అనే పాట బాగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే పాటను టైటిల్ గా తన సినిమాకు పెట్టాలని నిర్ణయించుకున్నాడట.కథకు ఈ టైటిల్ సెట్ అవుతుందని అంటున్నారు. ఇదే టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.  

loader