'వచ్చాడయ్యో.. సామి' ౩డి మేకింగ్ వీడియో!

First Published 26, May 2018, 10:53 AM IST
vacchadayyo saami song 3d making video
Highlights

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా మంచి విజయాన్ని అందుకుంది

మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తాజాగా ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన 'వచ్చాడయ్యో సామీ' సాంగ్ ౩డి మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

మహేష్ పంచె కట్టుకొని రావడం అతడిపై చిత్రీకరించిన సన్నివేశాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. మొదట మహేష్ పంచె కట్టుకున్నప్పుడు ఇబ్బందిగా నడుస్తూ వచ్చారని.. కానీ ఆ కాస్ట్యూమ్ కారణంగా మంచి పేరొచ్చిందని దర్శకుడు కొరటాల శివ అన్నారు.

ఇక మహేష్ సినిమా స్క్రిప్ట్ ను ఎంతగానో ప్రేమించానని అసలు రెండు పార్టులుగా సినిమా తీసి ఉంటే ఇంకా బావుండేదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

loader