సంగీత దర్శకుడు తమన్ కి ఇప్పుడు టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగింది. అతడు సంగీతం అందిస్తోన్న సినిమాలు కూడా మంచి విజయాలను  అందుకుంటున్నాయి. 'తొలిప్రేమ','అరవింద సమేత' వంటి సినిమాలతో మరింత పేరు సంపాదించుకున్నాడు.

ఓ పక్కన పూర్తి స్థాయిలో సినిమాలకు పని చేస్తూనే మరోపక్క ఇతర సినిమాలకు కూడా సహాయం చేస్తుంటాడు. మొన్నటికిమొన్న 'సై రా' సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి తన నేపధ్య సంగీతాన్ని జోడించి అలరించాడు.

నిజానికి ఆ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది. తాజాగా 'సాహో' సినిమా విషయంలో కూడా తమన్ ఇలానే చేశాడు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన మేకింగ్ వీడియోకి నేపధ్య సంగీతం అందించింది తమనే.. నిజానికి శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.

వారు ఇతర పనులతో బిజీగా ఉండడంతో 'షేడ్స్ ఆఫ్ సాహో' కోసం తమన్ ని తీసుకున్నారు. కేవలం ఈ వీడియోకే తమన్ ని పరిమితం చేయడం లేదు. ఇతగాడితో చిత్రనిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఓ డీల్ కుదుర్చుకుంది.

సినిమాకు సంబంధించిన ప్రతి టీజర్ కి తమనే సంగీతం అందిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం మనం సాహో చాప్టర్ 1 చూశాం. త్వరలోనే మరిన్ని చాప్టర్లు రానున్నాయి. 

ఇది కూడా చదవండి.. 

'షేడ్స్ ఆఫ్ సాహో'.. ప్రభాస్ లుక్ మాములుగా లేదుగా!