PUSHPA : పుష్ప నుంచి మరో క్రేజీ అప్డేట్.. హిందీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’ . పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలు విడుదల కానున్నది. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17 న విడుదల కానున్నది. ఈ చిత్రం హిందీలో కూడా విడుదల కానున్నది.
PUSHPA : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అందించారు పుష్ప మూవీ మేకర్స్. సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, అందాల భామ రష్మిక మందన్నా జంటగా నటిస్తోన్న మూవీ పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ పూర్తిచేసుకుని పుష్ప ది రైజ్ అనే టైటిల్‌తో ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దంగా ఉంది. రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో ప్రచారం కార్యక్రమాలను వేగవంతం చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ మారాయి. అలాగే హీరో హీరోయిన్ల ఫస్ట్ లూక్స్ కు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.
మామూలుగా బన్నీ, సుకుమార్ ల కాంబో అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా ఈ అప్టేట్స్ తో చిత్రంపై ఓ రేంజ్లో హైప్స్ క్రియేట్ చేశాయి. ఇది ఉంటే.. మరో బిగ్ అప్డేట్ ఇవ్వడానికి మూవీ మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జు్న్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పుష్ప మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో బన్నీ ఊర మాస్ గా కనిపిస్తూ.. చేతిలో గన్ పట్టుకుని కూర్చున్నాడు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప సినిమా.. హిందీలోనూ విడుదలకానున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హిందీలో కూడా డిసెంబర్ 17న పుష్ప సినిమా రిలీజ్ కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.
ఇక అటు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పుష్ప డిసెంబర్ 17వ తేదీనే థియేటర్లలో విడుదల కానుంది.
పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తొలుత సినిమా కష్టాలు తప్పలేదు.ఈ సినిమా హిందీ వర్షన్ థియేటర్‌లో విడుదలయ్యే అవకాశాల్లేవని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్ అవుతుందనీ, హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఉన్నట్టు ప్రచారం జరిగింది.
పుష్ప మూవీ షూటింగ్‌ను ప్రారంభానికి ముందే బన్నీ డిమాండ్ ను దృష్ట్యా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ను ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్‌కు అమ్మేశారని టాక్. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనీ భావించి.. అందుకు తగ్గట్లుగానే నిర్మించి, ప్రమోషన్స్ చేశారు. ప్రతీ పోస్టర్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. కానీ హిందీ డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి.. పుష్పను థియేటర్‌లో ఎలా విడుదల చేస్తారని ఎదరు తిరిగినట్టు తెలిసిందే.
ఈ తరుణంలో హిందీలో రిలీజ్ కావడం అనుమానమే అనిపించింది. ఈ మధ్య ఆ సమస్యను పరిష్కరించినట్టు తెలిసింది. దీంతో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయనున్నారు. పుష్ప సినిమాను హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏఏ ఫిల్మ్స్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ పలు భారీ సినిమాను బాలీవుడ్ లో విడుదల చేశారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటిస్తుండగా.. రష్మిక అతని ప్రేయసి శ్రీవల్లి పాత్రలో కనిపించనున్నది. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటిస్తుండగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు