Rashmika mandanna: కిల్లింగ్స్ లుక్స్ టెంప్టింగ్ ఐస్... రష్మిక కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మనసు గల్లంతే
స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ముంబై టు హైదరాబాద్... హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతుంది. సౌత్ తో నార్త్ చిత్రాలలో ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తున్న రష్మిక... ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్న ఆమె, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తున్నారు.
ఇక తెలుగులో రష్మిక హీరోయిన్ గా రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా విడుదల కానున్న పుష్ప మొదటి పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. డిసెంబర్ 17న విడుదల అవుతుండగా, 6న ట్రైలర్ విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీగా పుష్ప భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.
అలాగే శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో సమంత హీరోయిన్ గా చేస్తున్నారు. ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న మిషన్ మజ్ను, గుడ్ బై, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు షూట్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు రష్మిక.
కాగా పుష్ప లో రష్మిక రోల్ చాలా ప్రత్యేకం అని చెప్పాలి. రష్మిక డీ గ్లామర్ రోల్ చేస్తుండగా థర్డ్ సింగిల్ 'సామీ సామీ' పాటలో అందాల విందుతో రచ్చ చేసింది. ఈ సాంగ్ లో రష్మిక గ్లామర్ హైలెట్ గా నిలిచింది. పల్లెటూరి నాటు పిల్ల అవతారంలో ఘాటు అందాల రుచి చూపించింది రష్మిక.
Rashmika
పైట తీసి నడుమున దోపి, నాభి, నడుముతో పాటు ఎద అందాలు చూపిస్తూ తనలోని సరికొత్త యాంగిల్ పరిచయం చేసింది. పుష్ప అంటే పడిచచ్చే శ్రీవల్లి పాత్రలో రష్మిక జీవించినట్లు అనిపించింది. ఈ అల్ట్రా మోడ్రన్ హీరోయిన్, డీగ్లామర్ గెటప్ లో అదరగొట్టింది. రోల్ డీగ్లామర్ అయినా, అందాలు మాత్రం సూపర్ హాట్ గా చూపించేసింది.
Rashmika
ఇక స్టార్ హీరోయిన్ గా కోట్ల సంపాదన కలిగిన రష్మిక ముంబైలో కూడా ఇల్లు కొననున్నారట. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో అక్కడ ఓ పర్మినెంట్ ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో రష్మిక రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆమె హాట్ ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ లో కిల్లింగ్స్ లో టెంప్ట్ చేశారు. రష్మిక చూపులు గుండెలకు గాయం చేస్తుండగా.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Also read Tamannaah: మిల్కీ బ్యూటీ అని ఊరకే అంటారా.. థైస్ అందాలతో తమన్నా హాట్ ట్రీట్
Also read నాజూకైన అందాలని స్కిన్ ఫిట్ డ్రెస్ లో బంధించిన దిశా పటాని.. మెస్మరైజింగ్ పిక్స్ వైరల్