శివరాత్రిన 800 ఏళ్ల నాటి శివాలయంలో ఉపాసన పూజలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన మహాశివరాత్రిని పురస్కరించుకుని పురాతన శివాలయాన్ని దర్శించుకున్నారు. దేవుడు విరాళాలు కోరుకోడు. ఆయన భక్తుల నుంచి భక్తి, శుభ్రతను కోరుకుంటారని రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. దయచేసి ఆలయాలను పవిత్రంగా ఉంచండి అంటూ వేడుకొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఉపాసన 800 ఏళ్ల నాటి దోమకొండ సంస్థానంలోని పురాతన ఆలయాన్ని దర్శించుకున్నారు.

800 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాన్ని మీకు పరిచయం చేయాలనుకొంటున్నాను. ఇది చాలా పవిత్రమైనంది. ఈ ఆలయం సమీపంలో మా పూర్వీకులు 400 ఏళ్ల క్రితం దోమకొండ కోటను నిర్మించారు. నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ ఆలయాన్ని దర్శించుకొంటాను. శుభ్రమైన నీటితో స్వయంగా నా చేతులతోనే కడుగుతాను. నా కోర్కెలు తీరాలని మొక్కు కొంటాను. అవి వారంలో తీరుతాయి. అని తెలుపుతూ ఉపాసన ట్విట్టర్ లో పెట్టారు.