ఉపాసన పంచుకున్న పర్సనల్ విషయాలు

ఉపాసన పంచుకున్న పర్సనల్ విషయాలు

మెగా కోడలు ఉపాసన, రామ్ చరణ్ దంపతులంటే టాలీవుడ్ లో చూడముచ్చటైన జంటల్లో ఒకటి. ఇక స్టార్ హీరో భార్యగా ఉండటం కంటే ఒక పెద్ద మల్టీ మిలియనీర్ కంపెనీని నడపటం సులభం అంటోంది మెగా కోడలు ఉపాసన. అంతేకాదు దానికి తగ్గ కారణాలు కూడా వివరించింది. వాళ్ళు చేసే సినిమాలను బట్టి ఇంట్లో వాతావరణాన్ని సర్దాల్సి ఉంటుందని.. మానసికంగా శారీరకంగా అధిక ఒత్తిడితో ఇంటికి వచ్చిన వాళ్ళకు స్వర్గంలో ఉన్నాం అన్న ఫీలింగ్ కలిగించకపోతే మనసుకు శాంతి ఉండదని చెప్పింది.అలా కనక లేకపోతే బడలికతో వచ్చిన భర్తకు ఇల్లే నరకంలా ఉంటుందన్న ఉపాసన ఆ విషయంలో తను చాలా జాగ్రత్తలే తీసుకుంటుందట.
 

కొత్త కోడలిగా అడుగు పెట్టే ఎవరికైనా మొదటి ఏడాది చాలా ఇబ్బందిగా ఉంటుందని ఎక్కువ అలవాటు లేని మనుషుల మధ్య అడ్జస్ట్ కావడానికి టైం పడుతుందని కొన్ని సమస్యలు వచ్చినా వాటిని దాటుకోవడమే గెలుపని చెప్పింది. పాజిటివ్ థింకింగ్ గురించి కూడా కాస్త గట్టిగా నొక్కి చెప్పిన ఉపాసన తన బలమే ఆదని చెబుతోంది.  సోషల్ మీడియా ప్రభావం సొసైటీ మీద చాలా ఉందని నెగటివ్ గా తీసుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయని  తాను మాత్రం పాజిటివ్ గా తీసుకోవడం వల్లే తనకు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య హెల్త్ విషయంలో తన ఫాలోయర్స్ కు సోషల్ మీడియా ద్వారా ఆన్ లైన్ క్యాంపైన్లు నిర్వహిస్తూ అవగాహన  కలిగిస్తున్న ఉపాసన తాను వాటిని పాటించి మరీ ఇతరులకు చెప్పడం బాగా వైరల్ అవుతోంది. మొత్తానికి మెగా కోడలి ముచ్చట్లు విన్న లేడీ ఫాన్స్ తను  ఎంత పెద్ద శ్రీమంతురాలైనా టిప్స్ చెప్పడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos