బ్రాహ్మణి వీడియో పోస్ట్ చేసిన ఉపాసన.. గ్రేట్ ఫ్రెండ్ షిప్

First Published 2, Dec 2017, 4:52 PM IST
upasana konidela and brahmani nara becoming good friends
Highlights
  • తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా, నందమూరి ఫ్యామిలీల ప్రత్యేకత
  • మెగా కోడలు ఉపాసన, నందమూరి బ్రాహ్మణి(నారా లోకేష్ సతీమణి) ఫ్రెండ్ షిప్
  • బాక్సాఫీస్ వార్ లో పోటీపడే ఇద్దరు హీరోల ఫ్యామిలీ మెంబర్స్ స్నేహంపై వైరల్ టాక్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా నిలిచిన మెగా, నందమూరి ఫ్యామిలీలకున్న ప్రత్యేకత వేరు. ప్రస్థుతం మెగాస్టార్ చిరంజీవి అగ్రహీరోగా కొనసాగుతుండగా... తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మాజీ ముఖ్యమంత్రి, నాటి నంబర్ వన్ హీరో నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి ఆయన వారసుడిగా వచ్చి తనదైన శైలిలో అగ్రహీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న బాలకృష్ణలిద్దరూ ఈ తరం వరకూ అగ్ర స్థానంలో నిలుస్తున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలెన్నో.

 

అయితే బాక్సాఫీస్ వార్ లో నువ్వా నేనా అనుకునే ఈ హీరోల ఫ్యామిలీలకు సంబంధించి జరుగుతున్న తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల కాలంలో మెగా కోడలు ఉపాసన, బాలయ్య కూతురు బ్రాహ్మణిల స్నేహం మరింతగా బలపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంటుంది.

 

ఇటీవల ఉపాసన, బ్రాహ్మణిల మధ్య జరిగిన కొన్ని స్నేహపూర్వకమైన సంఘటనలు చూస్తే... ఇద్దరూ ఓ కుటుంబ సభ్యుల్లా.. స్నేహంగా మెలుగుతూ కనిపించడం అబ్బురపరుస్తుంది. ఇటీవలే ఇద్దరూ.. ఓ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నప్పటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఆ తర్వాత హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సందర్భంగానూ ఉపాసన, బ్రహ్మణి ఇద్దరూ కలిసి మెలిసి కనిపించారు. తాజాగా అపోలో థియేటర్ లో మాయాబజార్ సినిమాను స్క్రీనింగ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మాణితో రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి సర్ ప్రైజ్ ఇచ్చింది ఉపాసన.

 

వీళ్లిద్దరూ ఇటీవల మరింత స్నేహంగా మెలగటం, సోషల్ మీడియాలో కూడా ఇద్దరికీ సంబంధించిన స్నేహం గురించి చర్చ జరగటం చూస్తుంటే వీళ్లిద్దరూ.. భలే మిత్రులు అయ్యారని చర్చ జరుగుతోంది. తాజాగా అపోలో థియేటర్ స్క్రీనింగ్ గురించి బ్రాహ్మణి వీడియోను ఉపాసన పోస్ట్ చేయడం తెలుగు సినీ లవర్స్ లో మాంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఇద్దరి స్నేహం గురించి ఖుషీగా ఫీలవుతున్నారు.

loader