గతంలో కాస్త బొద్దుగా వుండే మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన తాజాగా తన ఫిట్ నెస్ పైనే దృష్టి పెట్టిన కొణిదెల వారి కోడలు ట్రాన్స్ ఫామ్ యువర్ సెల్ఫ్ అంటూ తన వర్కవుట్స్ పై సోషల్ మీడియాలో ఉపాసన పోస్టులు

ఒకరిద్దరు తప్ప మీడియా ప్రతినిధులతో పెద్దగా రిలేషన్స్ లేకున్నా.. సోషల్ మీడియా పుణ్యమా అని ఉపాసన అడపాదడపా వార్తల్లో నిలుస్తునే వుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లైఫ్ లో జరిగే ఆసక్తికర అంశాలపై అప్ డేట్స్ ఇస్తూ ఉండే ఉపాసన.. ట్రాన్స్ ఫామ్ యువర్ సెల్ఫ్ అంటూ గత మూడు రోజులుగా కొత్త ఇనిషియేషన్ తీసుకుంది. తన కొత్త వర్కవుట్స్ గురించి సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టింది.

శక్తి పుంజుకునేందుకు, టోన్ అప్‌ కోసం ఈ వర్కవుట్స్ చేస్తున్నట్లు పేర్కొంది. ఇంకా ఈ వర్కవుట్స్ చేసేందుకు ఇషానీ రెడ్డి స్ఫూర్తే కారణమని తెలిపింది. ఆమెకు ప్రత్యేకంగా థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇకపోతే.. ఇలాంటి వర్కవుట్స్ ద్వారానే బొద్దుగా వుండే ఉపాసన స్లిమ్ అయ్యింది కూడా. ఆ తర్వాత ఉపాసన మళ్ళీ జిమ్ మాటెత్తలేదు కానీ మళ్ళీ తాజాగా తన వర్కౌట్ వీడియోలని పోస్ట్ చేసింది.

భర్త రామ్ చరణ్ మాదిరే తానుకూడా వర్కౌట్ల మీద శ్రద్ద పెట్టింది ఉపాసన. రామ్ చరణ్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్నది తెలిసిందే. దేహ దారుఢ్యం కోసం చరణ్ చాలా కష్ట పడతాడు. చరణ్ భార్య ఉపాసన గతంలో ఫిట్ నెస్ గురించి ఎక్కువగా పట్టించుకునేది కాదు.

అయితే పోలో క్రీడ పట్ల మాత్రం ఆమె చాలా ఆసక్తిని చూపించేది. తాజాగా ఆమె ఫిట్ నెస్ పై దృష్టి సారించింది. ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ను ఏర్పాటు చేసుకుని, అతని సమక్షంలో వర్క్ ఔట్స్ చేస్తోంది. వర్క్ ఔట్స్ చేయడం అంత సులభం కాదని... ఈ 30 రోజుల కాలంలో ట్రైనర్ సహకారంతో ఏమేం చేయగలనో అన్నీ చేస్తానని చెప్పింది.

Scroll to load tweet…