రామ్ చరణ్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్-ఉపాసన

రామ్ చరణ్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్-ఉపాసన

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'సైరా' షూటింగులో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. 'సైరా' నిర్మాత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా వెళ్లి బిగ్ బిని రిసీవ్ చేసుకున్నారు. అదే రోజు రామ్ చరణ్ పుట్టినరోజు విషయం తెలుసుకున్న అమితాబ్..... చెర్రీకి గులాబీ అందించి విష్ చేశారు.


 

దీనిపై ఉపాసన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... అమితాబ్ రాకతో రామ్ చరణ్ బర్త్‌ డే మరింత స్పెషల్‌గా మారిందని, చెర్రీకి ఇది జీవితాంతం గుర్తుండిపోయే బర్త్ డే పేర్కాన్నరు. అమితాబ్‌తో దిగిన ఫోటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఎంతో కొత్తగా సాగింది గతంలో కంటే రామ్ చరణ్ బర్త్ డే ఈ సారి చాలా కొత్తగా సాగిందని చెప్పాలి. సినిమా రిలీజ్‌కు రెండు మూడు రోజుల ముందు పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఇదే తొలిసారి.

 

రామ్ చరణ్‌ తన చిన్నతనం నుండి ప్రతి పుట్టినరోజుకు తల్లిదండ్రుల నుండి ఏదో ఒక గిఫ్ట్ అందుకుంటూనే ఉంటారు. అయితే ఈ సారి అందుకున్న గిఫ్ట్ ప్రత్యేకం. చరణ్ కోసం ప్రత్చేకంగా డిజైన్ చేయించిన వాచీ విదేశాల నుండి తెప్పించారు మెగాస్టార్ దంపతులు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా కొణిదెల ఫ్యామిలీలో చిన్న విందు జరిగింది. కుటుంబ సభ్యులంతా ఈ విందుకు హాజరయ్యారు. ఇలాంటి వేడుకలకు దూరంగా ఉండే పవన్ కళ్యాణ్ కూడా ఈ విందుకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos