అడిగినోడికల్లా "ముద్దు" ఇవ్వటానికి నేను పబ్లిక్ ప్రాపర్టీనా?

unknown person demands kiss from heroine ada sharma
Highlights

  • ముంబై ఎయిర్ పోర్ట్ లో అదా శర్మకు చేదు అనుభవం
  • సినిమాల్లో ముద్దులిచ్చినట్టే తనకు ముద్దులివ్వాలన్న ఓ అభిమాని
  • సినిమాలు వేరు రియల్ లైఫ్ వేరంటూ చెప్పు తెగుద్దని అదా వార్నింగ్

 

హిరోయిన్ అదాశర్మకు ముంబయి ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెను చూసిన ఒక అభిమాని ఆదా వద్దకు వెళ్లాడు. తనను కుమార్తె లాంటిదానివంటూనే... ముద్దు పెట్టాలని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతని ప్రవర్తనతో తనకు బాధకలిగినా చిరునవ్వుతో (కుక్క మొరుగుతోందనుకుంటూ) వెళ్లిపోతూనే వుంది. అయినప్పటికీ ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా... సినిమాల్లో అయితే ముద్దు పెడతావ్.. నాకు పెట్టవా? అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి పిచ్చి ప్రేలాపనల్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ చేసేశారు.

 

అంతే అప్పటి నుంచి ఆదాకు కొత్త సలహాలు రావటం మొదలయ్యాయి. ఆ పెద్ద మనిషి అడిగింది ఇవ్వటానికి ఇబ్బందేమిటి?  అంటూ ప్రశ్నించటం మొదలు పెట్టారు. దీంతో చిరాకు పడిన ఆదా ట్విట్టర్ లో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తనకు సలహాలు ఇస్తున్న వారిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.  గడిచిన మూడేళ్లలో తాను ట్విట్టర్ లో ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంత ఆగ్రహంగా తాను కామెంట్ చేయలేదని.. కానీ.. తనపై వస్తున్న విమర్శలు చూస్తే తప్పట్లేదన్నారు.
 

ముద్దు ఇస్తే పోయేదేముంది? అంటున్నారు.అసలు నా జీవితంలో ఏది పెద్ద విషయం? ఏది చిన్న విషయం? అన్నది నిర్ణయించటానికి మీరెవరు? ఎవరిని ముద్దు పెట్టుకోవాలో.. ఎవరిని పెట్టుకోకూడదో చెప్పటానికి మీకేం హక్కుంది? నా జీవితం నాది.  అంటూ నిలదీసింది.

ఎవడు పడితే వాడు నన్ను ముద్దు అడిగితే చెప్పు దెబ్బ తింటారన్నారు. హార్ట్ ఎటాక్ చిత్రంలో హయతి ముద్దు ఇచ్చిందని.. కమాండో 2లో భావనా రెడ్డి ముద్దు ఇచ్చిందని.. అవన్నీ సినిమా పాత్రలని.. రీల్ పాత్రలకు..రియల్ పాత్రకు తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోకూడదని క్లాస్ పీకింది.

తనకు మనుషుల పట్ల గౌరవం ఉందని.. తన జీవితంలోనూ తండ్రి.. తాతయ్య.. స్నేహితులు.. దర్శకులు.. నటులు అందరూ ఉన్నారని.. తాను పురుషులకు వ్యతిరేకం కాదని.. కానీ సినిమాల్లో ముద్దు పెట్టాను కాబట్టి... ఎవడు పడితతే వాడు వచ్చి ముద్దు పెట్టమని అడిగితే చెప్పు తెగుద్ది అంటూ ఘాటుగా స్పందించింది ఆదా.

 

1920 చిత్రంలో  తాను దెయ్యం పాత్రను పోషించానని.. రాత్రిళ్లు చాలామందిని ఆ సినిమాలో చంపేశానని.. దానర్థం చంపుతూ పోవాలనా... అంటూ రీల్ కు రియల్ కు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆదా. ఏం తప్పులేదు. శెభాష్ ఆదా.

loader