నక్షత్ర మీడియా పతాకంపై జెడి చక్రవర్తి, అక్షిత జంటగా అమ్మ రాజశేఖర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇటీవలే 'ఉలవచారు' రెస్టారెంట్‌లో ఈ మూవీ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జెడి చక్రవర్తి, అమ్మ రాజశేఖర్‌, హీరోయిన్‌ అక్షిత, బెనర్జీ, గౌతం రాజు, చమ్మక్‌చంద్ర, ఆజాద్‌, జబర్ధస్త్‌ ఆర్కే తదితరులు పాల్గొన్నారు. పోస్టర్‌ని ఎమ్మెల్యే వేణుగోపాలచారి ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్‌ మాట్లాడుతూ..'మా గురువు గారు జెడి చక్రవర్తి హీరోగా నేను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'ఉగ్రం' అనే టైటిల్‌ని ఖరారు చేశాము. ఇదొక వెరైటీ సబ్జెక్ట్‌. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంకా 10 రోజులు షూటింగ్‌ జరుపుకుని, వచ్చే నెల మొదటివారంలో ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని జరుపనున్నాం... అని అన్నారు. 


'ఉగ్రం' చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. థమన్‌, కెమెరా: అంజి, ఎడిటింగ్‌: గౌతంరాజు, ప్రొడ్యూసర్‌: నక్షత్ర రాజశేఖర్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అమ్మ రాజశేఖర్‌.