ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్ట్..!

ఉదిత్ నారాయణ్ కొడుకు అరెస్ట్..!

                                 Related image

 

బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్ బాధ్యతాయుతంగా కారు నడిపి ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలు కావడానికి కారణమయ్యాడు. ముంబయిలో జరిగిన ఈ ఘటనతో ఆదిత్య అరెస్టయ్యాడు. ఈ కేసులో ఆదిత్యకు వెంటనే బెయిల్ కూడా లభించింది.

గతంలో ఒకసారి ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి బుక్కయ్యాడు. మీ అంతు చూస్తా అంటూ అతను బెదిరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా అతను తన బెంజ్ కారును ర్యాష్ గా నడుపుతూ ప్రమాదానికి కారణమయ్యాడు. యు టర్న్ వద్ద కూడా విపరీతమైన వేగంతో కారు నడిపిన అతను ఆటో రిక్షా మీదికి కారును ఎక్కించేశాడు.

దీంతో ఆటో రిక్షా కార్మికుడితో పాటు అందులోని మహిళ కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి వాంగ్మూలం మేరకు పోలీసులు ఆదిత్యపై కేసు నమోదు చేశారు. ఆదిత్య చిన్నపుడే బాలనటుడిగా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత తండ్రి వారసత్వాన్ని అందుకుని సింగర్ గా మారాడు. ప్రస్తుతం నటుడిగా.. గాయకుడిగా కొనసాగుతున్నాడు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos