ఈ వారంలో 12 సినిమాల విడుదల!

First Published 13, Dec 2017, 5:36 AM IST
twelve movie set to be released this week
Highlights

మరి ఈ సినిమాలన్నింటిలో ఏది హిట్ అవుతుందో.. ఏది పక్కకు పోతుందో చూడాలి!

 

గత రెండు నెలలుగా టాలీవుడ్ లో చిన్న సినిమాల జాతర జరుగుతోంది. ప్రతి శుక్రవారం కూడా చిన్న సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇక డిసంబర్ మూడో వారం నుండి పెద్ద సినిమాలు విడుదల ఉండడంతో ఇక ఆ తేదీ మారిపోతే ఏప్రిల్ తరువాతే సినిమాలను విడుదల చేసుకోవాలి. దీంతో దర్శకనిర్మాతలు తమ చిత్రాలను వరుసగా విడుదల చేస్తూనే ఉన్నారు. గత వారంలో ఆరేడు సినిమాను విడుదల కాగా, ఈ వారంలో మరో డజను చిత్రాలు సందడి చేయబోతున్నాయి. గురు, శుక్రవారాలు రెండు రోజులు కలిపి 12 సినిమాలు విడుదల కానున్నాయి. ముందుగా గురువారం నాడు సందీప్ కిషన్ నటించిన 'ప్రాజెక్ట్ జెడ్' సినిమా విడుదల కానుంది. అలానే 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' అనే మరో సినిమా కూడా అదే రోజు రానుంది. 

ఇక శుక్రవారం నాడు యాంకర్ జయతి నటించిన 'లచ్చి' సినిమా, యాంకర్ రవి హీరోగా పరిచయం అవుతున్న 'ఇది మా ప్రేమకథ' వంటి చిత్రాలతో పాటు 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్','ఉందా లేదా','తొలిపరిచయం','సీత రాముని కోసం', 'మామా ఓ చందమామ','ప్రేమ పందెం','కుటుంబ కథా చిత్రం' అలానే మరో రెండు చిన్న చిత్రాలు 'దృశ్యం', 'పడిపోయా నీ మాయలో' ఇలా డజను చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ సినిమాలన్నింటిలో ఏది హిట్ అవుతుందో.. ఏది పక్కకు పోతుందో చూడాలి!

loader