బిగ్ బాస్ తెలుగు 7 చివరి వారం నడుస్తుంది. ఫైనలిస్ట్ లకు బిగ్ బాస్ గ్రాండ్‌గా స్వాగతం పలుకుతున్నారు. ఇందులో శివాజీ, ప్రియాంక జైన్ ఎమోషనల్ అయ్యారు.
బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ ముగింపుకి చేరుకుంది. ఈ ఆదివారంతో షో పూర్తి కానుంది. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లో ఉన్నారు. శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, అర్జున్, యావర్, ప్రియాంకలు ఉన్నారు. టాప్ 6 కంటెస్టెంట్లుగా ఉన్నారు. వీరిలో టైటిల్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఫైనల్‌కి చేరుకున్న నేపథ్యంలో ఈ ఆరుగురికి బిగ్ బాస్ గ్రాండ్‌గా వెల్ కప్ పలికారు.
ఒక్కొక్కరి గురించి చెబుతూ, వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వారి పర్సనాలిటీని కీర్తిస్తూ, వారి ఆట తీరుని ప్రశంసిస్తూ, వారు ఫైనల్‌కి చేరుకునేందుకు చేసిన పోరాటం, పడ్డ స్ట్రగుల్స్, ఫేస్ చేసిన అడ్డంకులను వివరిస్తూ అద్భుతంగా వెల్ కమ్ చెప్పారు బిగ్ బాస్. ఓ రకంగా వారికి ఓ సెలబ్రేషన్ తీసుకొచ్చారు. ఈ వంద రోజులు బిగ్ బాస్ హౌజ్‌లో వారు ఉన్న తీరు బెస్ట్ మూమెంట్స్ ని ఫోటో ఫ్రేములుగా చేసి గార్డెన్‌ని ముస్తాబు చేశాడు. వారిని ఆనందింప చేశారు. ఆ మెమొరీలోకి తీసుకెళ్లారు.
ఇప్పటికే అమర్ దీప్, అర్జున్‌లకు స్వాగతం చెప్పారు బిగ్‌బాస్. నేడు మంగళవారం ఎపిసోడ్‌లో శివాజీ, ప్రియాంకలకు వెల్ కమ్ చెప్పారు. ఇందులో ప్రియాంకని ఘనంగా కీర్తించారు. ఎవరితో స్నేహం సరైనదో, ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారి ఎంచుకోవాలో స్పష్టత ఉందని చెప్పారు. ఇంటికి ఆయువు పట్టులాంటి కిచెన్‌కి ఉన్న శక్తిని అర్థం చేసుకుని అక్కడి నుంచే ఆట ప్రారంభించినట్టు చెప్పాడు. సింపుల్ ప్రియాంకలా ఉండే మీరు శివంగిలో విరుచుకుపడుతూ నామినేషన్‌లలో విరుచుకుపడ్డ తీరు, అందరికి అర్థం అయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలన్నీ వాటి నుంచి తేరుకుని మీ ఆటపై దృష్టి పెట్టారు తప్ప, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు` అంటూ కీర్తించాడు బిగ్ బాస్. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ స్వాగతానికి ఫిదా అయ్యింది.
ఇక శివాజీకి సైతం అదే స్థాయిలో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పాడు బిగ్ బాస్. మొదట గార్డెన్‌లో తన వెల్‌కమ్ డెకరేషన్ చూసి ఉప్పొంగిపోయాడు శివాజీ. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కారే ఆనందభాష్పాలను పంటికింద అదిమి పట్టుకుని నా ఇరవై ఏళ్ల కెరీర్ ఓ ఎత్తు, ఈ బిగ్ బాస్ ఓ ఎత్తు అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఈ సందర్భంగా బిగ్ బాస్ చెబుతూ, మిమ్మల్ని ఒక్కరు వేలెత్తి చూపిస్తే, మిగిలిన నాలుగు వేళ్లు మీ వైపే ఉన్నాయని చెప్పే మాటకారి మీరు. మీ గాయం మిమ్మల్ని ఎంత బాధించినా, ఓటమి వైపు చూడలేదు. మీ అబ్బాయే మీ డాక్టర్‌గా వచ్చినప్పుడు మీ బాధనంతా మర్చిపోయారు. సరైన సమయంలో సరైన పావులు కదిపి చాణుక్యుడిగా నిలిచారు. ఈ పూర్తి సీజన్‌లో మీ పై పై చేయి సాధించిన ఒకే ఒక విషయం కాఫీ పై మీ ఇష్టం మాత్రమే అని తెలిపారు బిగ్ బాస్. మీ ఆట తీరే మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టిందన్నారు. దీంతో శివాజీ ఎమోషనల్ అయ్యారు.
ఇదిలా ఉంటే గత సీజన్లలో ఎప్పుడూ టాప్ 5 కంటెస్టెంట్లు ఫైనల్‌కి వెళ్లే వారు. కానీ ఈసారి టాప్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు. మరి ఈ లెక్కేంటి అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఏడో సీజన్ కావడంతో టాప్ 7 ఉంటారని అంతా అనుకున్నారు. అదే భావించారు. కానీ అనూహ్యంగా శోభా శెట్టిని హౌజ్ నుంచి పంపించారు. ఇప్పుడు టాప్ 6 ఉన్నారు. వీరిలో అందరిని చివరి వరకు ఉంచుతారా? లేక మధ్యలో పంపిస్తారా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. మధ్యలోనే ఓ కంటెస్టెంట్‌ని ఇంటికి పంపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read more: Bigg Boss Telugu 7: టైటిల్ రేసు నుండి అమర్ దీప్ అవుట్... అలా హింట్ ఇచ్చిన నాగార్జున!
కానీ టాప్ 6 చివరి వారం వరకు ఉంటారని, ఆదివారం రోజే ఒక్కోక్కరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తుంది. మరి ఏది నిజమనేది తెలియాల్సి ఉంది. ఈ సీజన్ అంతా ఉల్టాఫుల్టా అని హోస్ట్ నాగార్జున చెబుతున్న విషయం తెలిసిందే. మరి అలాంటి ట్విస్ట్ ఏదైనా ఉంటుందా? లేక ఈ సిక్స్ తోనే నడిపిస్తారా? అనేది చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న వారిలో వీక్‌గా ఉన్న వారు ప్రియాంక, యావర్. వీరిలో ఎవరి పంపించినా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రియాంకని పంపిస్తే లేడీస్‌కి అన్యాయం జరుగుతుందనే కామెంట్స్ వస్తాయి? యావర్‌ని పంపిస్తే రేటింగ్ పడిపోతుందని బిగ్ బాస్ నిర్వహకులు సేఫ్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తుంది. ఏది నిజమో తెలియాల్సి ఉంది.
Also read: Bigg Boss Telugu 7: విన్నర్ ఎవరో తేల్చేసిన ప్రముఖ సర్వే... అతనిదే టైటిల్!
