- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: టైటిల్ రేసు నుండి అమర్ దీప్ అవుట్... అలా హింట్ ఇచ్చిన నాగార్జున!
Bigg Boss Telugu 7: టైటిల్ రేసు నుండి అమర్ దీప్ అవుట్... అలా హింట్ ఇచ్చిన నాగార్జున!
బిగ్ బాస్ తెలుగు 7 మరో ఐదు రోజుల్లో ముగియనుంది. టైటిల్ ఎవరు అందుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. టైటిల్ ఫేవరేట్స్ లో ఒకరిగా ఉన్న అమర్ దీప్ టైటిల్ కొట్టే ఛాన్స్ లేదని నాగార్జున పరోక్షంగా హింట్ ఇచ్చాడు.

ఇక టైటిల్ రేసులో ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారని మెజారిటీ ప్రేక్షుకుల అభిప్రాయం. శివాజీ, ప్రశాంత్, అమర్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. అమర్ దీప్ చివరి వారాల్లో కొంత పుంజుకున్నాడు. అదే సమయంలో అతడికి బుల్లితెర ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది.
హాట్ స్టార్ చూసే వాళ్లలో మెజారిటీ ఓటింగ్ అతనికి పడే అవకాశం ఉంది. ప్రతి సర్వేలో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉంటున్నాడు. అమర్ దీప్, శివాజీ కంటే అతడికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. అయితే పల్లవి ప్రశాంత్ కి మిస్డ్ కాల్ ఓటింగ్ సరిగా పడటం లేదనే వాదన వినిపిస్తోంది.
పల్లవి ప్రశాంత్ ఓటింగ్ నెంబర్ కలవడం లేదు. పదే పదే ట్రై చేస్తే కానీ... ఎప్పటికో రింగ్ అవుతుంది. అందరూ ప్రశాంత్ కి ఓటు వేయడం వలన లైన్ బిజీ అవుతుందా లేక ఏదైనా సాంకేతిక లోపం ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇది పల్లవి ప్రశాంత్ కి మైనస్ కావచ్చని కొందరు అంటున్నారు.
అయితే టైటిల్ విన్నర్ అయ్యే అన్ని అర్హతలు పల్లవి ప్రశాంత్ కి ఉన్నాయి. అతడు అనేక విజయాలు సాధించాడు. ఎందరు రెచ్చగొట్టినా హద్దుమీరి మాట్లాడింది లేదు. ప్రశాంత్ హౌస్ కి మొదటి కెప్టెన్ అయ్యాడు. పవర్ అస్త్ర గెలిచాడు. అవిక్షన్ పాస్ సైతం గెలుపొందాడు.
ఇక శివాజీ మొదటి నుండి మైండ్ గేమ్ ఆడుతున్నాడు. హౌస్లో డామినేషన్ కి గురైన ప్రశాంత్, యావర్ లకు అండగా నిలిచి జనాల్లో అభిమానం సంపాదించాడు. కొన్ని వారాల వరకు శివాజీ పేరు మాత్రమే టైటిల్ రేసులో వినిపించింది. టాస్క్ లలో విజృభించిన ప్రశాంత్ రేసులో దూసుకొచ్చాడు. శోభ పీక మీద కాలేసి తొక్కుతా అనడం ప్రశాంత్ కి మైనస్ అయ్యింది.
14వ వారం ప్రారంభంలోనే ఓటింగ్ మొదలైంది. ఈ వారంలో శివాజీ, అమర్ దీప్ లకు నెగిటివ్ ఎపిసోడ్. ప్రశాంత్ మీద చేయి చేసుకుని, బూతులు తిట్టి అమర్ నెగిటివ్ అయ్యాడు. శివాజీ శోభ విషయంలో నెగిటివ్ అయ్యాడు. 14వ వారం వరకు ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ ముందున్నాడనే సందేహాలు కలుగుతున్నాయి.
Bigg Boss Telugu 7
ఇక అమర్ దీప్ అసలు టైటిల్ రేసులో లేడని, హోస్ట్ నాగార్జున హింట్ ఇచ్చేశాడంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. ఆదివారం ఫన్నీ టాస్క్ లో భాగంగా పాప్యులర్ మీమ్స్ కంటెస్టెంట్స్ కి డెడికేట్ చేయాలని నాగార్జున చెప్పారు. బాలకృష్ణ ఓ సినిమాలో చెప్పే 'సరి సర్లే ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా'' ఏంటి మీమ్ శివాజీ అమర్ కి డెడికేట్ చేశాడు.
Bigg Boss Telugu 7
దీనిపై రియాక్ట్ అయిన నాగార్జున... అది అమర్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది అన్నాడు. కప్పు కొడతాని భ్రమలో అమర్ ఉన్నాడని, అది జరగదని నాగార్జున 14వ వారం ఓటింగ్ ఆధారంగా చెప్పేశాడని సోషల్ మీడియా టాక్. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది.