రోడ్డు ప్రమాదంలో నటుడు సునీల్ మృతి

First Published 26, Jun 2018, 9:55 AM IST
tv actor sunil died in road accident
Highlights

హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం

బుల్లి తెర వర్ధమాన నటుడు నన్నం సునీల్‌(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని రాచర్లపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటుచేసుకుంది. 

కోవూరు మండలం పడుగుపాడు గ్రామానికి చెందిన షకీల్‌ హైదరాబాద్‌లో సినీ సంగీత దర్శకుడిగా ఉన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లికి చెందిన సునీల్‌ కొన్నేళ్లుగా షకీల్‌ వద్ద శిక్షణ పొందుతూ.. టీవీ సీరియళ్లు, సినిమాల్లో నటిస్తున్నాడు. 

షకీల్‌ తమ్ముడు సలావుద్దీన్‌ నెల్లూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి ఇంటర్వ్యూ నిమిత్తం హైదరాబాద్‌ నుంచి వస్తున్నాడు. దీంతో సునీల్‌ స్వగ్రామానికి వద్దామని అతనితో పాటు కారులో బయలుదేరాడు. 

రాచర్లపాడు వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో సునీల్‌ అక్కడికక్కడే మృతిచెందగా సల్లావుద్దీన్‌ కోమాలోకి వెళ్లాడు.

loader