ప్రముఖ టీవీ యాక్టర్ మధుప్రకాష్ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. భారతి(34) నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర్తల మధ్య గొడవలే భారతి మృతికి కారణం అని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసులు మధుప్రకాష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. గుంటూరుకి చెందిన భారతికి.. మధుప్రకాష్‌తో 2015లో వివాహం జరిగింది. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. అత్తమామలతో కలిసి మణికొండలోని పంచవటి కాలనీలో ఫ్లాట్‌లో ఉంటున్నారు. భర్త మధుప్రకాష్‌.. సీరియల్‌లో నటిస్తుండం కారణంగా ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు.. ఇది నచ్చని భారతి.. సీరియల్స్‌ మానేయమని చెబుతూవుండేది.

అలాగే.. కొంతకాలంగా.. మరో సీరియల్ నటితో మధుప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబకలహాలు మరింత ఎక్కువయ్యాయని కుటుంబసభ్యులు చెప్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పోలీసులదృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం కూడా ఇలాగే ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  మంగళవారం ఉదయం పది గంటలకు మధుప్రకాశ్‌ జిమ్‌కు వెళ్తున్నట్లు ఆమెతో చెప్పి బయటికి వెళ్లారు. 

అటు నుంచే మధు షూటింగ్‌కు వెళ్లిపోయారు. మధ్యలో ఓ సారి ఆమె భర్తకు వీడియో కాల్‌ చేసి తాను ఉరివేసుకంటున్నట్లు బెదిరించారు.కాగా మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఆయన షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చారు. మధుప్రకాష్ ఎంత పిలిచినా.. భారతి తలుపు తీయకపోవడంతో.. అనుమానమొచ్చి ఆయన మరో తాళంతో.. డోర్ తీసి లోపలికి వెళ్లి చూసేసరికే చీరతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని భారతి కనిపించింది. దీంతో.. షాక్ తిన్న మధు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. భారతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

సీరియల్ నటుడి భార్య సూసైడ్.. భర్త వేధింపులే కారణమా?

ప్రముఖ సీరియ‌ల్ న‌టుడి భార్య ఆత్మహ‌త్య