ప్రముఖ సీరియ‌ల్ న‌టుడు మ‌ధుప్రకాష్ భార్య  భారతి (34) ఉరేసుకుని ఆత్మహ‌త్యకు పాల్పడింది.  హైదరాబాద్ లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మధు ప్రకాష్  వేధింపులే ఆత్మహత్యకు కారణం అని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.దంపతుల మధ్య గొడవలే ఆమె బలవన్మరణానికి కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. 

మధు ప్రకాష్  కేవలం సీరియల్స్ మాత్రమే కాక బాహుబలి తో పాటు అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. లండన్ నుంచి వచ్చి 2 ఏళ్ల క్రితం మధుప్రకాశ్ ని భార‌తి పెళ్లి చేసుకుంది. ఆమె నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తతోపాటు అత్తామామలు, మరిదితో కలిసి పంచవటి కాలనీలోని  ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. కొంత కాలంగా మరో సీరియల్ నటితో మధు ప్రకాష్ చనువుగా ఉండటంతో కుటుంబ కలహాలు మొద‌ల‌య్యాయని చెప్తున్నారు. ఈ విష‌యాన్ని పలుమార్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ  జరిగింది. మంగళవారం ఉదయం పది గంటలకు మధుప్రకాశ్‌ జిమ్‌కు వెళ్తున్నట్లు ఆమెతో చెప్పి బయటికి వెళ్లారు. అటు నుంచే మధు షూటింగ్‌కు వెళ్లిపోయారు. మధ్యలో ఓ సారి ఆమె భర్తకు వీడియో కాల్‌ చేసి తాను ఉరివేసుకంటున్నట్లు బెదిరించారు. కాగా మంగళవారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో ఆయన  షూటింగ్‌ నుంచి ఇంటికి వచ్చారు.

 కాగా ఆమె తన పడకగది లోపలి నుంచి గడియ పెట్టుకుంది. భర్త ఎంత పిలిచినా ఆమె తలుపు తీయకపోవడంతో  మధు...తన వద్ద ఉన్న మరో తాళంతో తలుపులు తెరిచి లోనికి వెళ్లి చూసేసరికే చీరతో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయి ఉంది. రాయదుర్గం పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.    మ‌ధుప్రకాష్ మాటీవీలో ప్రసార‌మ‌య్యే కుంకుమ పువ్వు సీరియ‌ల్ లీడ్ రోల్‌లో న‌టిస్తున్నాడు. దీంతో పాటు ఈటీవీ సీరియ‌ల్స్ కూడా లో న‌టించాడు.