Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 6 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో దివ్య అది కాదమ్మా అమ్మకు సంబంధం లేదని చెప్పాను అప్పుడైనా తన రియలైజ్ అవ్వాలి కదా అని అంటుంది. నాకు తాళి కట్టిన భర్తనే లాక్కుంది. అంతకంటే పెద్ద తప్పు ఉంటుందా, ఆ విషయంలోనే తను ఇప్పటివరకు రియలైజ్ అవ్వలేదు. మాట వరసకు కూడా నాకు సారీ చెప్పలేదు అది తన వ్యక్తిత్వం అని అంటుంది తులసి. అవన్నీ పక్కన పెట్టు పెళ్లి సంబంధం విషయంలో నేనేమైనా తొందరపాటు నిర్ణయం తీసుకున్నానా అనడంతో అమ్మ జీవితాన్ని పక్కనుండి చూసి చాలా నేర్చుకున్నావు అని అంటాను అంటుంది తులసి. నాకు నీలో నచ్చిన విషయం ఏమిటంటే నీకు ఏం కావాలో నువ్వు క్లారిటీ ఉంది. కావాల్సిన దాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచన ఉంది.
ఏ విషయం అయినా పైకి చెప్పే ధైర్యం ఉంది ఇవి చాలమ్మా నిన్ను ఎవరు ప్రభావితం చేసి నిన్ను ఎవరూ వారి చేతిలోకి తీసుకోలేరు అని అంటుంది తులసి. అప్పట్లో నిన్ను నాన్న ఎలా ఏడిపించారో నాకు తెలుసమ్మా కానీ నాన్నంటే ప్రేమ గౌరవం ఎందుకంటే తను మా నాన్న కాబట్టి అని అంటుంది దివ్య. ఆయన వల్ల బాధ అనుభవించిన నువ్వే అంత కోపంగా లేవు అంటే నేను కోప్పడడంలో అర్థం లేదని మౌనంగా ఉన్నానమ్మా అని అంటుంది దివ్య. మరొకవైపు లాస్య కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో అక్కడికి నందు వస్తాడు. దివ్యకి ఇష్టం లేకపోయినా మనకోసం తులసి దివ్యని రిక్వెస్ట్ చేసింది అనగా ఇలాగే నాటకాలు ఆడి మిమ్మల్ని మాయ చేస్తోంది. మిమ్మల్ని అందరిని మోసం చేస్తోంది అని అంటుంది లాస్య.
ఇంతకుముందు దివ్యకి పెళ్లి సంబంధం నో అని చెప్పు అని తనని ఫుల్లుగా ప్రిపేర్ చేసింది అని లాస్య అనడంతో ఒకటి గుర్తుపెట్టుకో ఎవరి మెప్పు పొందడానికి తులసి అలాంటి పనులు చేయదు తనతో పాతికేళ్ళు కాపురం చేశాను అని అంటాడు నందు. ఓహో అంత మంచిదైతే డివోర్స్ ఎందుకు ఇచ్చావు ఇంకో పాతికేల్లు కాపురం చేయాల్సింది కదా అని మాట్లాడే అక్కడి నుంచి కోపంగా వెళుతుండగా ఆగు అని అంటాడు నందు. ఆ విషయం గురించి కూడా మాట్లాడదాం నీకు నచ్చినప్పుడు అలాగా అవసరం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకు.
అతడు దివ్యకి సూట్ కాడనే అనుకుంది అందుకే రిజెక్ట్ చేసింది అనడంతో ఒక్క ప్రశ్నతో ఇతను ఎలా నిర్ణయించుకుంటుంది నువ్వు కూడా ఆ దివ్య కే సపోర్ట్ చేస్తున్నావా అని అంటుంది లాస్య. ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధం వస్తుంది. ఈ కూతురు పోతే ఒక కూతురు వస్తుందా అది నాతో కూడా మాట్లాడకపోతే నేనేం చేయాలి అనడంతో ఇలాంటి ఆస్తిపరుల సంబంధం మళ్లీ మళ్లీ వస్తుందా అని అంటుంది లాస్య. దివ్య కు పెళ్లి జరిగి ఉంటే నీకు కూడా లాభం కలిగేది కదా నందు అనడంతో ఒకప్పుడు ప్రేమ్ విషయంలో ఇలాంటి పొరపాటు చేశాను ఇప్పుడు ఆ పొరపాటు మళ్ళీ చేయను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నందు.
అప్పుడు చూడు నందు ఈ లాస్యని తక్కువ అంచనా వేస్తున్నారు తులసి చేతనే దివ్య జీవితం నాశనం ఇలా చేస్తాను నేను పగబడితే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చాలెంజ్ విసురుతుంది. మరోవైపు విక్రమ్ దివ్యని తలుచుకుని సంతోషపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వాళ్ళ మామయ్య తాగి వచ్చి తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎవరా అమ్మాయి అనడంతో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అనగా పర్సు పోగొట్టుకున్నోడు మొఖము మనసు పోగొట్టుకున్న వాళ్ళ మొఖం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు అల్లుడు అని అంటాడు. నేను అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి అని విక్రమ్ అడగడంతో వెటకారంగా సమాధానం చెబుతూ ఉంటాడు.
ఇక చాలు మిగతా సంగతులు నేను చూసుకుంటాను అని అంటాడు విక్రమ్. మరొకవైపు దివ్య విక్రమ్ కీ ఫోన్ చేయగా అప్పుడు వాళ్ళ మామయ్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు తాగిన మైకంలో విక్రమ్ వాళ్ళ మామయ్య తింగరి తింగరిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య మాట్లాడుతున్న గాని తాగిన మైకంలో ఏదేదో మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత దివ్య తులసి షాపింగ్ మాల్ కి వెళ్లి వస్తుండగా ఎందుకమ్మా నేను సంపాదిస్తున్న కదా నీ డబ్బులతో ఎందుకు తీసించావు అనడంతో 22 ఏళ్లు పెంచిన నా కూతురు నీ డబ్బు నా డబ్బుని మాట్లాడడంతో నాకు బాధగా ఉంది అని అంటుంది తులసి. ఇప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి అజయ్ వస్తాడు.
అప్పుడు కోపంగా తులసి వాళ్ళ వైపు చూసి వెళ్తుండగా ఇంతలో తులసి పిలిచి బాబు ఒక్క నిమిషం ఆగు మీకు స్వారీ చెప్పాలి అనడంతో ఎందుకు ఎవరు అడిగారు మీ స్వారీ అని అంటాడు అజయ్. పెళ్లిచూపులు విషయంలో జరిగిన దానికి బాధపడుతున్నారని సారీ చెబుదాం అనుకున్నాను అనడంతో మీరు తప్పుగా అనుకుంటున్నారు. పెళ్లి చూపులు క్యాన్సిల్ అయినందుకు సంతోషపడుతున్నాను పండగ చేసుకుంటున్నాను అయినా మీ అమ్మాయి ఏమైనా ఎలిజిబెత్ రాణినా లేక మిస్ యూనివర్స అంటూ నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటాడు అజయ్. మొదటి పెళ్ళానికి విడాకులు ఇచ్చి ఏదో ఎంజాయ్ చేస్తుంటే ఈ లాస్య వెంటపడి నన్ను వేధించింది.
ఓకే అని ఈ పెళ్లి చూపులకు ఓకే చేశాను అనడంతో ఏంటి నీకు ఇదివరకే పెళ్లయిందా అని అడుగుతుంది తులసి. అవును పెళ్లయింది రెండో పెళ్లికి కాబట్టే మీకు ఓకే చేశాను లేదంటే మా ఆస్తిలో మా కాలు గోటికి కూడా మీరు సరిపోరు అనడంతో మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ అజయ్ అని సీరియస్ అవుతుంది దివ్య. రెండవ పెళ్లి అని చూడకుండా పొరపాటున సంబంధం సెట్ అయి ఉంటే మా అమ్మాయి గొంతు కోసేవాడిని అనడంతో మీ అమ్మాయి ఏమన్నా అందగత్త అనడంతో నోటికి వచ్చిన విధంగా మాట్లాడకు అని కోపంగా మాట్లాడుతుంది తులసి. నీ మొదటి పెళ్లి విషయం దాచి ఉంటుంది కాబట్టి లాస్య మీ వెంటపడింది అనగా తనకు అన్నీ తెలుసు మేము ఏది దాచిపెట్టలేదు అజయ్ అనడంతో తులసి దివ్య షాక్ అవుతారు.
ఆ తరువాత తులసి కోపంగా ఇంటికి వెళ్లి లాస్య అని గట్టిగా అరుస్తుంది ఇంతలో అక్కడికి అందరూ వస్తారు. అప్పుడు లాస్య చేయి పట్టుకుని దివ్య నీ కన్నా కూతురు అయితే ఇలాగే చేసేదానివే అనడంతో ఏమైంది తులసి అని నందు అడగగా నిజం దాచి పెట్టి దివ్యని రెండో పెళ్లి వాడికి అంట కట్టాలని చూసింది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. వాడికి పెళ్లయ్యి డివోర్స్ కూడా అయింది అనడంతో అవునా అని నందు లాస్య మీద విరుచుకుపడతాడు. ఇప్పుడు లాస్య ఆ విషయాన్ని కూల్ గా తీసుకొని ఎందుకు అంత కోపంగా అరుస్తావు నందు ఇది మనకేం కొత్త కాదు కదా. తులసి అంటే ఇష్టం లేకపోవడం వల్లే కదా డివోర్స్ ఇచ్చిన నన్ను పెళ్లి చేసుకున్నావు అంత మాత్రం దానికి ఎందుకు ఇంతలా విరుచుకుపడతావు అంటూ కూల్ గా మాట్లాడుతుంది లాస్య. లాస్య మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటారు.
