యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని తెలిసిందే. మార్చి 26న సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా వస్తుండగా సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పూజా హెగ్దె, శ్రద్ధ కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా దసరా బరిలో దించాలని ఫిక్స్ చేశారట. జూనియర్ కు దసరా సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ జై లవ కుశ దసరాకి దిగి దుమ్ములేపింది. ఇప్పుడు అదే హిట్ మేనియా కంటిన్యూ చేసేలా త్రివిక్రం సినిమాను దసరాకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.


సినిమాలో ఎన్.టి.ఆర్ మేకోవర్ కొత్తగా ఉంటుందని అంటున్నారు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం కచ్చితంగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ సినిమా కోసం ఎంతో జాగ్రత్తపడుతున్నాడట. అనిరుద్ ప్లేస్ లో తమన్ ను తీసుకుని సినిమా బెస్ట్ అవుట్ పుట్ వచ్చేలా చూస్తున్నారట.

మళ్ళీ దసరాకి టార్గెట్ పెట్టిన ఎన్టీఆర్..! ఎన్నాళ్ల నుండో క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటే మాత్రం రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు. అసలే వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న ఎన్.టి.ఆర్ ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.