తను డైరెక్ట్ చేసే సినిమాలకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాడు త్రివిక్రమ్. ఇక భారీ బడ్జెట్ సినిమా అంటే తప్పకుండా దేవీ ఉండాల్సిందే. అలాంటిది త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టేసారని, ఆ కారణంగానే 'అరవింద సమేత' కోసం తమన్ ని రంగంలోకి దింపారంటూ వార్తలు వినిపించాయి. 

తాజాగా ఇదే ప్రశ్న త్రివిక్రమ్ కి ఎదురైంది. మీరు ఈ మధ్య దేవిశ్రీప్రసాద్ ని పక్కన పెట్టేసినట్లున్నారని..? ప్రశ్నించగా.. దానికి సమాధానంగా ''నిజంగా చెప్పాలంటే దానికి పెద్దగా కారణాలేవీ లేవు.నాకు దేవి అంటే ఎప్పటికీ ఇష్టమే. మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం.

ఈ సినిమాతో నన్ను నేను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే.. విలేకరులు ఇదివరకు పని చేస్తోన్న సంస్థలో మానేసి కొత్త సంస్థలోకి ఎందుకు వచ్చారంటే ఏం చెబుతారు..? దానికి కారణం గొడవలే అవ్వాల్సిన అవసరం లేదు కదా. మార్పు కోసమే.. నాలో మార్పు కోసం కొత్త సంగీత దర్శకులతో చేస్తున్నాను.

దేవి ఒకటే రకమైన మ్యూజిక్ చేస్తున్నాడని నేను అనడం లేదు.. అలా చేస్తే అతడికి ఇన్ని హిట్లు ఎందుకు వస్తాయి. 'అ ఆ' సినిమా బడ్జెట్ ప్రకారం దేవిశ్రీ ఎక్కువ. దీంతో అనిరుద్ అనుకున్నాం. చివరకి మిక్కీతో చేయించాం. అంతే తప్ప దేవికి నాకు ఎలాంటి గొడవలు లేవు'' అంటూ వెల్లడించాడు. 

ఇవి కూడా చదవండి..

పవన్ వాళ్ల అన్నకే ఏం చెప్పడు.. ఇంక నాకేం చెప్తాడు: త్రివిక్రమ్

ఎన్టీఆర్ తో చాలా ఇబ్బంది పడ్డా.. త్రివిక్రమ్ వ్యాఖ్యలు!

మొదటి సారి సాయం కోరిన త్రివిక్రమ్!

పగబట్టినా పర్ఫెక్ట్ గా పట్టాలి.. అదే త్రివిక్రమ్ స్టైల్!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?