Asianet News TeluguAsianet News Telugu

పగబట్టినా పర్ఫెక్ట్ గా పట్టాలి.. అదే త్రివిక్రమ్ స్టైల్!

చాలా వరకు సినిమా దర్శకుల్లో తెలియని ఆవేశం కనిపిస్తుంది. వారు రచయితల విభాగం నుంచి వస్తే ఆ డోస్ ఎక్కువగానే ఉంటుంది. బావోద్వేగమైన సందర్భాల్లో వారి మాటల్లో చాలా పదును కనిపిస్తుంది. అలాంటి దర్శకుడే త్రివిక్రమ్. ఆయన గతంలో ఇచ్చిన  స్పీచ్ లు ఇప్పటికి ఆలోచింపజేస్తాయి. ఇక సినిమాల్లో ఆయన రాసే డైలాగుల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

trivikram strong screen play in aravindha sametha
Author
Hyderabad, First Published Oct 6, 2018, 4:04 PM IST

చాలా వరకు సినిమా దర్శకుల్లో తెలియని ఆవేశం కనిపిస్తుంది. వారు రచయితల విభాగం నుంచి వస్తే ఆ డోస్ ఎక్కువగానే ఉంటుంది. బావోద్వేగమైన సందర్భాల్లో వారి మాటల్లో చాలా పదును కనిపిస్తుంది. అలాంటి దర్శకుడే త్రివిక్రమ్. ఆయన గతంలో ఇచ్చిన  స్పీచ్ లు ఇప్పటికి ఆలోచింపజేస్తాయి. ఇక సినిమాల్లో ఆయన రాసే డైలాగుల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

అయితే త్రివిక్రమ్ చూడటానికి కూల్ గా కనిపిస్తారుగా ఆయన పగబట్టిన మ్యాటర్ ఏమిటని ఆలోచిస్తున్నారా?. అజ్ఞాతవాసి సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో అరవింద సమేత సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనీ సక్సెస్ పై పగ పెంచేసుకున్నాడు. సినిమా కథలో లో ఎలాంటి సన్నివేశాలు ఉండాలనేది పక్కాగా ప్లాన్ చేసుకొని తన స్క్రీన్ ప్లేతో కమర్షియల్ సినిమాను ఇవ్వాలని అనుకుంటున్నాడు. 

ఎందుకంటే గతంలో ఖలేజా డిజాస్టర్ అనంతరం జులాయి సినిమాతో తన పవర్ఫుల్ స్క్రీన్ ప్లేను చూపించి అన్నివర్గాలను ఆకట్టుకున్నాడు. సక్సెస్ రానప్పుడే వెంటనే దానిపై రీవేంజ్ తీర్చుకున్నారు. ఇప్పుడు అరవింద సమేతపై కూడా అదే కసరత్తులు చేసి తెరకెక్కించాడు. అందుకే ఈ సినిమాపై ముందు నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. 

మొదటి టైటిల్స్ పడకముందే ఫ్యాక్షన్ డ్రాప్ లో యాక్షన్ సన్నివేశాలు మొదలవుతాయని తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ముగిసేవరకు తారక్ ను రొమాంటిక్ బాయ్ గా చూపించి ఒక్కసారికి ప్రీ క్లైమాక్స్ లో సీమకు సంబందించిన సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయట. ఇక ఇంటర్వెల్ అనంతరం తారక్ తన అసలైన విశ్వరూపాన్ని చూపిస్తాడట. త్రివిక్రమ్ రాసిన డైలాగులకు ఎన్టీఆర్ వాయిస్ విజిల్స్ వేయిస్తుందని తెలుస్తోంది. 

తారక్ తండ్రి నాగబాబుకి ప్రత్యర్థి జగపతి బాబుకి సంబందించిన సన్నివేశాలు మరో లెవల్లో ఉంటాయని టాక్. ఇరు వర్గాల కారణంగా ఎంత మంది మరణించారు వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? అరవింద రాఘవ ఈ పగలను ఆపడానికి ఏ విధంగా ముందుకు సాగాడు అనేది అసలైన సినిమా కథ.  ప్రతి సీన్ త్రివిక్రమ్ శైలిని తెరపై చుపిస్తాయని సమాచారం. మరి ఈ సినిమాతో మాటల మాంత్రికుడు ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios