ఈ టాయిలెట్ దగ్గర త్రిష ఏం చేస్తుందో తెలుసా?

ఈ టాయిలెట్ దగ్గర త్రిష ఏం చేస్తుందో తెలుసా?

హీరోయిన్లు ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తుంటారో మనకు తెలిసిందే. అయితే సోషల్ సర్వీస్ లో ముందుండే ముదురు హిరోయిన్ త్రిష మాత్రం తాను ఆ టైపు కాదని నిరూపిస్తోంది. యునిసెఫ్ తరఫున అంబాసిడర్ గా బాధ్యతలు నిర్వర్తిసస్తున్న త్రిషా ఆ సంస్థ చేపడుతున్న ప్రజా హిత కార్యక్రమాలకు తన వంతు చేయూత అందిస్తోంది.

 

ప్రధాని మోదీ డ్రీమ్ కాన్సెప్ట్ అయిన.. స్వచ్చ భారత్ ప్రాముఖ్యత వివరించేలా తనే స్వయంగా ఇటుకలు పేరుస్తూ మరుగుదొడ్డి నిర్మాణానికి తన వంతు చేయూత అందిస్తోంది. ఇది నిజంగా స్ఫూర్తి ఇచ్చే విషయమే. ఇప్పటికీ లక్షల గ్రామాల్లో కనీస అవసరం అయిన మరుగుదొడ్డి లేక అక్కడి మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళడం 2017 జమానాలో కూడా కొనసాగుతోంది. అందుకే అక్షయ్ కుమార్ ఏకంగా టాయిలెట్ పేరుతో ఒక సినిమా తీస్తే ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది.త్రిష లాంటి హీరొయిన్లు ఇలా ముందుకు రావడం వల్ల అభిమానులే కాక సాధారణ పౌరులు కూడా ప్రభావితం చెందే అవకాశం ఉంది. స్వచ్చంగా ఉండటం అంటే మనుషులతో పాటు పరిసరాలను కూడా ఉంచుకోవడం అనే పాయింట్ ని ఇలా పాపులర్ హీరొయిన్లు చెబితే మెసేజ్ త్వరగా రీచ్ అవుతుంది అనడంలో డౌట్ అక్కర్లేదు. మరి త్రిషని ఆదర్శంగా తీసుకుని ఇంకెవరు ముందుకు వస్తారో చూడాలి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page