హీరో కాలికి గాయంతో రూ. 500 కోట్లు నష్టం!

Tom Cruise broke his ankle filming Mission Impossible fallout
Highlights

సినిమాలను అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చేయడానికి దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకున్న ప్రకారం జరగకపోతే గనుక నిర్మాతలకు అదనపు భారం పడుతుంది

సినిమాలను అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం పూర్తి చేయడానికి దర్శకనిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అనుకున్న ప్రకారం జరగకపోతే గనుక నిర్మాతలకు అదనపు భారం పడుతుంది. సినిమా ఆడితే పర్వాలేదు.. నెగెటివ్ టాక్ వస్తే గనుక నష్టాలు తప్పవు. టాలీవుడ్ లో షూటింగ్ లు ఆలస్యమైనా.. లక్షల్లోనే ఖర్చవుతుంటుంది. కానీ హాలీవుడ్ లో మాత్రం అలా కాదు. ఏదైనా తేడా వచ్చి షూటింగ్ ఆపేస్తే మాత్రం భారీ ఎత్తున భారం పెరిగిపోతుంది.

'మిషన్ ఇంపాజిబుల్-ఫాలౌట్' సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుందని తెలుస్తోంది. పారామౌంట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో టామ్ క్రూజ్ హీరోగా నటించాడు. షూటింగ్ లో భాగంగా హీరో ఒక ఇంటి మీద నుండి మరో ఇంటి మీదకు దూకాలి. ఆ సమయంలో టామ్ క్రూజ్ కాలికి గాయమైంది. నొప్పిని లెక్కచేయకుండా మరో షాట్ లో నటించాడు.

దీంతో కాలి గాయం మరింత ఎక్కువైంది. డాక్టర్లు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పడంతో షూటింగ్ ను కొన్నాళ్ల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో అనుకున్న బడ్జెట్ కంటే రూ.500 కోట్లు అదనపు భారం పడినట్లు సమాచారం. రూ.1700 కోట్లలో తీయాలన్న సినిమాకు కాస్త రూ.2200 కోట్లు  ఖర్చయ్యాయి. ఈరోజే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

loader