ప్రముఖ సినీ నిర్మాత గుండెపోటుతో మృతి!

First Published 31, Jul 2018, 8:56 AM IST
tollywood producer k raghava is no more
Highlights

తాతామనవడు, సంసారం సాగరం వంటి సినిమాలకు గాను నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. 

ప్రముఖ నిర్మాత, ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కె.రాఘవ(105) గుండెపోటుతో మరణించారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ లో ఈ తెల్లవారు జామున ఆయన తుదిశ్వాస విడిచారు. 1913లో తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో కోటిపల్లి అనే గ్రామంలో ఆయన జన్మించారు.

ఎన్నో చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాతామనవడు, సుఖ దుఃఖాలు, అంతులేని వింతకథ, చదువు సంస్కారం ఇలా అనేక చిత్రాలను నిర్మించి బాలనాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో నటించారు. తాతామనవడు, సంసారం సాగరం వంటి సినిమాలకు గాను నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు.

ఇండస్ట్రీకు దాసరి నారాయణరావు, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, కోడిరామకృష్ణ ఇలా చాలా మందిని పరిచయం చేసిన ఘనత ఆయనది. ఆయనకొక కుమారుడు, కుమార్తె ఉన్నారు.   

loader