తేజ, ఆర్పీ పట్నాయక్ సినిమాలకు పాటల రచయితగా పని చేశాడు కులశేఖర్. చిత్రం, జయం, నువ్వునేను, ఇంద్ర ఇలా దాదాపు వందకి పైగా సినిమాలకు గేయ రచయితగా పని చేసిన కులశేఖర్ ఇప్పుడు దొంగగా మారడం ఇండస్ట్రీకి దిగ్బ్రాంతికి గురి చేసింది. ఓ గుడి దగ్గర దొంగతనం చేశారనే కారణంతో పోలీసులు కులశేఖర్ ని అరెస్ట్ చేసి ప్రెస్ నోట్ ని విడుదల చేశారు.

అయితే ఇది మొదటిసారి కాదు.. గతంలోనూ ఇదే నేరచరిత్ర ఉంది. 2013లో కాకినాడలోని బాలాత్రిపుర సుందరి అమ్మవారి శఠగోపాన్ని దొంగిలించి పోలీసులకు పట్టుబడ్డారు. అందులో శిక్షకు గురయ్యారు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. అయితే కులశేఖర్‌కు ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయని.. మెదడుకు సంబంధించిన ఓ వ్యాధి కారణంగా మెమరీని కోల్పోయాడన్నప్రచారం జరుగుతోంది.

ఇది ఇలా ఉండగా.. అతడు దొంగగా మారడానికి బ్రాహ్మణులే కారణమని మరో ప్రచారం జరుగుతోంది. ఓ సినిమాలో కులశేఖర్ రాసిన పాట పూజారులను కించపరిచేలా ఉందని ఆ సామాజిక వర్గం అతడిని వెలివేసింది. దీంతో బ్రాహ్మణులపై ద్వేషం పెంచుకున్నకులశేఖర్, పూజారులను, ఆలయాలని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలని పాల్పడుతున్నాడని అంటున్నారు.

సినిమాలలో అవకాశాలు తగ్గడం, ఆయన సొంతంగా డైరెక్ట్ చేసిన సినిమా రిలీజ్ ఆలస్యం కావడం వంటి విషయాలువలన కులశేఖర్ మానసికంగా కుంగిపోయి ఇప్పుడు దొంగగా మారి ఉంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్త.. 

టాలీవుడ్‌కు షాక్.. దొంగతనం కేసులో సినీ రచయిత కులశేఖర్ అరెస్ట్